Rasamayi Balakishan: తెలంగాణలో టీఆర్ఎస్ లో పొగలు.. సెగలు అసెంబ్లీ సాక్షిగా బయటపడుతున్నాయి. తాజాగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బరెస్ట్ అయ్యాడు. తనకు మైక్ కట్ చేసినందుకు భగ్గుమన్నాడు. తన నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నిస్తే మైక్ కట్ చేస్తారా? అని డిప్యూటీ స్పీకర్ పద్మారావుపై చిందులు తొక్కారు.
అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇలా ఏకంగా స్పీకర్ పై ఫైర్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అయితే రసమయి బాలకిషన్ ఎప్పటి నుంచో టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉంటున్నారు. ఈయన పార్టీ మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడు. పైగా హుజూరాబాద్ పక్కనే మానకొండూర్ నియోజకవర్గం ఉంటుంది. సో ఈటల రాజేందర్ ను తొలగించినప్పటి నుంచి రసమయి టీఆర్ఎస్ లో ఇమడలేకపోతున్నారు. ఈటలలా అసమ్మతి రాజేయడం లేదు. ఎదురు తిరగడం లేదు.
Also Read: Venkaiah Naidu: రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు..? వైసీపీ, బీజేడీతో బీజేపీ మంతనాలు?
అప్పటి నుంచి కక్కలేక మింగలేక పరోక్షంగా అధికార టీఆర్ఎస్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. బరెస్ట్ అవుతున్నారు. తాజాగా అసెంబ్లీలోనూ రసమయి ఆవేదన అందరికీ అర్థమైంది. కనీసం తన నియోజకవర్గ సమస్యలను కూడా ప్రస్తావించనీయడం లేదని రసమయి భగ్గుమన్నారు.
స్పీకర్ పద్మారావుపైనే సీరియస్ అయ్యారు. దీంతో ఈ వివాదం టీఆర్ఎస్ లో అనూహ్య మలుపు తిరిగింది. నెక్ట్స్ టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయేది రసమయి బాలకిషన్ అని అంటున్నారు. పొమ్మనలేకనే ఇలా రసమయికి పొగబెడుతున్నారని పలువురు చెబుతున్నారు.
Also Read: China Imposes lockdown: ప్రపంచం అంతా తెరుచుకుంటుంటే చైనా మూసేస్తుంది!
అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్, రసమయి మధ్య వాగ్వాదం | Deputy speaker #RadmaRao Vs #Rasamayi pic.twitter.com/AdA4cRFYmd
— TV9 Telugu (@TV9Telugu) March 12, 2022