Bhoo Varahaswamy Temple: భారతీయ సంప్రదాయంలో దేవుళ్లను నమ్ముతాం. ప్రతి విషయాన్ని దేవుడితోనే చెప్పుకుంటాం. ఎందుకంటే మన కష్టాలను తీర్చేది ఆయనే అని ఫిక్సవుతాం. అందుకే భగవంతుడి సన్నిధిలో మన కోరికలు చెప్పుకుని తీర్చాలని వేడుకుంటాం. ప్రతి పనికి ప్రత్యేకంగా ఓ దేవుడిని కొలవడం అలవాటు. అలా మనకు కలిగే కోరికలను బట్టి దేవుళ్లు మారుతుంటారు. ఆంజనేయ స్వామిని భయం పోవాలని వేడుకుంటాం. అలాగే సంతానం కోసం ఒకరు, సౌభాగ్యం కోసం మరొకరు ఇలా ప్రతి ఒక్క దేవుడికి ఒక ప్రత్యేకత ఉండటం సహజమే.
ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఆ కోరిక ఎంతకీ తీరకపోతే దీనికి ఓ భగవంతుడు ఉన్నాడు. కానీ ఆ క్షేత్రం కర్ణాటకలో ఉంది. మనం వెళ్లి ఆ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ పూజలు మన ఇల్లు పూర్తవడం ఖాయం. కొందరు ఇల్లు మొదలుపెట్టాక ఎంతకీ పూర్తి కాదు. కొందరు ప్రారంభిస్తామంటే కుదరదు. అలాంటి వారు ఇక్కడకు వెళ్తే తక్షణ ఫలితం కనిపిస్తుంది.
ఈక్షేత్రం కర్ణాటకలోని మైసూర్ లోని కృష్ణరాజ్ పేట సమీపంలోని కళ్ళహల్లి గ్రామంలో ఉంది. ఇక్కడి దేవున్ని ప్రళయ వరాహ స్వామి అని పిలుస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 3.30 గంటల నుంచి 7.30 వరకు పూజలు చేస్తారు. ఎడమ చేతిలో భూదేవిని కూర్చోబెట్టుకుని కూర్చున్న భంగిమలో స్వామి వారు ఉంటారు.
ఇక్కడ రెండు రకాల పూజా విధానం ఉంటుంది. ఒకటి ఇటుక, రెండు మట్టి పూజలు ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలనుకునే వారు ఇటుక, భూమి కొనాలి అమ్మాలనుకునే వారికి మట్టి పూజ నిర్వహిస్తారు. మనం ఇటుక పూజ చేయించుకుంటే ఆ ఇటుకను తీసుకొచ్చుకోవాలి. ఇంటి ముందు పెట్టి దానికి పూజ చేసి ఇల్లు పని ప్రారంభిస్తే ఇక నిర్విఘ్నంగా సాగుతుందని చెబుతారు.