Prabhas : ప్రభాస్ లాంటి స్టార్ హీరో ‘బాహుబలి ‘ సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్ ను విస్తరించుకున్నాడు. ‘బాహుబలి 2’ సినిమాతో 1900 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని కూడా షేక్ చేశాడు. ఇక ఎప్పుడైతే ఆ సినిమా వచ్చిందో అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సినిమాలతో భారీ సక్సెస్ లను సాధిస్తూ పాన్ ఇండియా రికార్డులను కొల్లగొడుతున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక సీనియర్ హీరోలందరు సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లిన ఏకైక హీరో ప్రభాస్(Prabhas)… ప్రస్తుతం ఆయన చాలా మంచి సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరి ఇప్పుడు వస్తున్న సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది…ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చాలామంది యంగ్ డైరెక్టర్లతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతుండటం విశేషం… ఇక 2024 వ సంవత్సరంలో కల్కి (Kalki) సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు రాజాసాబ్ (Rajasaab) సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవ్వనున్న నేపధ్యంలో ఈ సినిమా టీజర్ ని ‘ మహా శివరాత్రి’ కానుక గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇలాంటి స్టార్ హీరో ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో యూత్ ను టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు.నిజానికి ఆయన చేసే ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నప్పటికి యూత్ ను మాత్రం చాలా బాగా ఆకర్షిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
ఇక ఇదిలా ఉంటే ‘సందీప్ రెడ్డి వంగ ‘ (Sabdeep Reddy Vanga) దర్శకత్వంలో చేయబోతున్న ‘స్పిరిట్’ (Spirit) సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాలో ఆయన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. దానికి తగ్గట్టుగా ఆయన లుక్కులో కూడా చాలావరకు డిఫరెన్స్ ని మనం చూడొచ్చు అంటూ సందీప్ రెడ్డి వంగ చాలా స్పష్టంగా చెబుతున్నాడు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి పాయింట్ ను చాలా డీటెయిల్ గా రాసుకున్నట్టుగా కూడా సందీప్ తెలియజేస్తూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నా ప్రభాస్ ఇక మీదట కూడా అదే రీతిలో భారీ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…