India startup shutdown: అంతర్జాతీయంగా ఏర్పడుతున్న ఆర్థిక మాంధ్యం.. యుద్ధ పరిణమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది. ఇందులో భారత్ ఏమాత్రం తీసిపోలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కొన్ని కంపెనీలు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు తమ సంస్థ లేదా కంపెనీల్లోని ఉద్యోగులను తీసివేస్తున్నారు. క్రమంగా కొన్ని స్టార్టప్ కంపెనీలు కూడా మూతపడుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం భారత్ లో 11,223 స్టార్టప్ కంపెనీలు మూతపడినట్లు అంచనా. ఇది 2024 కంటే అధికంగా ఉంది. స్టార్టప్ హబ్ గా అమెరికా, చైనా తరువాత భారత్ మూడో స్థానంలో ఉంది. మరి ఇలా భారత్ లో ఇంత పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు మూతపడడానికి కారణం ఏంటీ?
కొత్త ఆలోచన.. వేగంగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేసే కంపెనీలను స్టార్టప్ కంపెనీలు అంటారు. ఈ కంపెనీలు కొత్త టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొన్ని సమస్యలకు పరిష్కారం కనుక్కొంటారు. మార్కెట్లో పలు సేవలకు మార్పులు తీసుకొస్తారు. ఇవి చిన్న వ్యాపారంలా అనిపించినా.. వీటి వృద్ధి చాలా వేగంగా ఉంటుంది. ఆన్ లైన్ పేమెంట్, ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం, ట్రాన్స్ పోర్టు ఆధారిత సేవలన్ని స్టార్టప్ కంపెనీలుగా ప్రారంభమై ఆ తరువాత మల్టీనేషనల్ కంపెనీలుగా ఎదిగాయి.
భారత్ లో 2016లో స్టార్టప్ పథకం ప్రారంభమైంది. బెంగళూరు, హైదరాబాద్, ఫూణె, చెన్నై, గుర్గావ్ వంటి ప్రధాన నగరాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇటీవల Financian Express తెలిపిన ప్రకారం 11,223 స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయి. 2024లో స్టార్టప్ కంపెనీలు 8,649 స్టార్టప్ కంపెనీలు మూతపడితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 11,223 మూతపడ్డాయి. ఈ ఏడాది ముగిసే వరకు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది గత ఏడాదితో పోలీస్తే 30 శాతం ఎక్కువ. వీటిలో Hike, Beepkart, Astra, Ohm Mobility, COde parrot, Bilip, Subltl AI, Ans Commerce వంటివి ఈ ఏడాదిలో మూతపడ్డాయి. వీటిలో 5,776 కంపెనీలు ఈ కామర్స్ కు చెందినవే. మిగతా వాటిలో 4,174 కంపెనీుల ఎంటర్ ప్రైజేస్ కు సంబంధించనవే ఉన్నాయి. 2,785 కంపెనీలు సాప్ట్ వేర్ రంగానికి చెందినవి ఉన్నాయి.
మూతపడ్డ కంపెనీలను పరిశీలిస్తే వాటికి రెవెన్యూ రాకపోవడం.. ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ఇవి మూత పడినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు సెంటర్ ఆప్ అట్రాక్షన్ గా ఈ కామర్స్ ఉండేది. కానీ ఈ విభాగంలో ఎక్కువగా కంపెనీలు మూతపడడం ఆందోళనను కలిగిస్తోంది. ఈ వ్యాపారాల కోసం పెద్ద ఇన్వెస్టర్ల కోసం ఎదురుచూడడం.. ఎక్కువగా డిస్కౌంట్లు ఇవ్వడంతో ఈ వ్యాపారాలపై ఎక్కువగా ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వ్యాపార రంగంలో సేఫ్ అనుకున్న ఎంటర్ ప్రైజేస్ పరిస్థితి కూడా ఇలా ఉండడంపై ఆందోళనను కలిగిస్తోంది.
2010 ప్రాంతంలో స్టార్టప్ పై ఎక్కువగా అవగాహ లేకపోవడంతో చాలా మంది ఇన్వెస్టర్లు స్టార్టప్ పై ఏర్పాటు చేసే కంపెనీల్లో ఇన్వెస్ట్ మెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఎవరిక వారే స్టార్టప్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఖర్చులు తగ్గించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఒక కంపెననీలో కొత్తగా ఇన్వెస్ట్ మెంట్ చేయాలని అనుకునేవారు దాని గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు. ఆ కంపెనీ అభివృద్ధి గురించి తెలుసుకున్న తరువాతే పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ముందు ముందు ఇలా గే ఉంటే చాలా వరకు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.