Indoor Skydiving In Hyderabad: మనం సినిమాల్లో చాలా సార్లు స్కై డైవింగ్‌ను చూస్తుంటాం. ఆకాశంలో సడెన్ గా విమానం నుంచి దూకేయడాన్ని స్కై డైవింగ్ అంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరం. చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఎముకలు విరిగిపోతాయి. కాగా ఇలాంటి స్కైడైవింగ్‌కు సంబంధించిన వీడియోలు చూసినప్పుడు వావ్ అనిపిస్తుంది కదా మనకు.

ఎందుకంటే ఆకాశంలో ఎలాంటి సపోర్టు లేకుండా విహరించడం అంటే చాలా ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. కాగా ఇలాంటి స్కై డైవింగ్ లు అంటే కేవలం విదేశాలు మాత్రమే మనకు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే మన ఇండియాలో ఇలాంటివి ఇప్పటి వరకు లేవనే నిరాశ ఉంది. కానీ ఇప్పుడు అందరికీ ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. పైగా తెలంగాణ వారికి ఇది ప్రతిష్టాత్మకం.
Also Read: ఇదో చరిత్ర: యూపీలో రెండోసారి బీజేపీ గెలవడానికి కారణాలివీ!
హైదరాబాద్ లో ఇండోర్ స్కై డైవింగ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇండోర్ స్కై డైవింగ్ అంటే ఆర్టిఫిషియల్ గా అరేంజ్ చేసిందన్నమాట. దీంట్లో డైవింగ్ చేయడం ఎవరికైనా చాలా ఈజీ. మహిళలు, చిన్నారులతో పాటు వృద్ధులు కూడా చేయొచ్చన్నమాట. జయం రవి, నివేదితా పేతురాజ్ నటించిన టిక్ టిక్ టిక్ మూవీలో ఇలాంటి ఆర్టిఫిషియల్ స్కైడైవింగ్ ఉంటుంది. ఆ మూవీ చూసిన వారికి ఇది అర్థం అవుతుంది.

హైదరాబాద్‌కు చెందిన మేడ రామ్, మేడ సుశీల్ లు దీన్ని స్థాపించనున్నారు. గ్రావిటీ సంస్థ ఆధ్వర్యంలో దీన్ని నిర్మిస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ మార్చి లేదా ఏప్రిల్ లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఇండర్ స్కై డైవింగ్ కోసం ఒక్కో వ్యక్తికి రూ.3వేల వరకు చార్జీలు వసూలు చేయనున్నట్టు సమాచారం. మరి స్కైడైవింగ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా.
Also Read: యూపీలో బీజేపీ గెలుపు వెనక ఎంఐఎం.. ఎస్పీని ఘోరమైన దెబ్బ కొట్టిన అసదుద్దీన్..?