Indians Resigning From Software Jobs: ఐటీ ఉద్యోగులు తమ కొలువులకు టాటా చెప్పనున్నారు. కరోనా కాలంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న సాఫ్ట్ వేర్ రంగం ప్రస్తుతం కుదేలైపోతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రంగాన్ని ఉద్యోగులు వీడనున్న సమాచారం కలవరపెడుతోంది. పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారని తెలుస్తోంది. సొంత వ్యాపారాలు చేసుకుని జీవితంలో స్థిరపడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమైతే మరికొందరు ఇతర ఉద్యోగాలు చేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ రంగంపై ఉద్యోగులు విశ్వాసం వ్యక్త చేయడం లేదు.

దేశవ్యాప్తంగా ఉన్న సాప్ట్ వేర్లలో దాదాపు 42 శాతం మంది తమ ఉద్యోగాలకు వదిలేయనున్నట్లు తెలుస్తోంది. చేస్తున్న జాబ్ లను వదిలేసి ఇతర ఉద్యోగాలు చేయడమో లేక కొత్తగా కంపెనీ స్థాపించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే చేసే పనిలో కూడా బోరు ఫీలవుతున్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లుగా ఒకటే జాబ్ చేస్తూ కొత్తదనం లేకుండా పోతోంది. అందుకే సాఫ్ట్ వేర్ డెవలపర్లు తమ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో సాఫ్ట్ వేర్ రంగం మరోమారు సంక్షోభం ఎదుర్కోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Infosys To Visakhapatnam: ఆంధ్రాకు మంచిరోజులు.. విశాఖకు టెక్ దిగ్గజాలు
గత సంవత్సరం దాదాపు 27 శాతం మంది డెవలపర్లు తమ ఉద్యోగాలు వదిలి కొత్త ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ ఏడాది కూడా మరింత మంది తమ ఉద్యోగాలను వదిలేసి నూతన మార్గాల్లో వెళ్లనున్నారని సమాచారం. ఇదే జరిగితే భవిష్యత్ లో సాఫ్ట్ వేర్ రంగం మరింత కష్టాల్లో పడనుంది. ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేర్ రంగం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. దీంతో సా్ట్ వేర్ రంగం ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

పనికి తగిన వేతనం రావడం లేదనే ఉద్దేశంతో కూడా చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ జాబ్ లు వదిలేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో దాదాపు 8 శాతం మంది ఉద్యోగులు గత సంవత్సరం తమ ఉద్యోగాలు వదిలి సొంతంగా కంపెనీలు పెట్టిన వారు కూడా ఉన్నారు. ఇక భవిష్యత్ లో కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు వదిలేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సాఫ్ట్ వేర్ రంగం మరో ముప్పును ఎదుర్కోనుందని తెలుస్తోంది.
Also Read:Governor Tamilisai- KCR: కేసీఆర్, గవర్నర్ తమిళిసై.. ఓ అజ్ఞాత ఐఏఎస్.. లొల్లి ముదిరిందిలా!