Infosys To Visakhapatnam: విశాఖపట్నంకు మంచి రోజులు వస్తున్నాయి. ఇన్నాళ్లు ఐటీ సంస్థలు గుర్తించకపోవడంతో ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమవడంతో ఇక భవిష్యత్ బంగారమే అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వెంట మరిన్ని ఐటీ సంస్థలు వచ్చేందుకు తయారుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో విశాఖకు ఐటీ సంస్థలు తమ కంపెనీలు ఏర్పాటు చేస్తాయని చెబుతున్నారు. దీంతో నిరుద్యోగుల సమస్యలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థ ఇక్కడ సంస్థ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

విశాఖ నగరంలో మరో సంస్థ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన సంస్థ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఐటీ రంగంలో విశాఖకు అవకాశాలు తక్కువగానే ఉండటంతో అక్కడ ఉద్యోగాలు చేసేందుకు చాలా మంది విముఖత చూపుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ సంస్థలన్ని హైదరాబాద్ కే ప్రాధాన్యం ఇచ్చాయి. దీంతో ఇక్కడ ఐటీ రంగం వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది మహిళలు తమకు ఉద్యోగావకాశాలు వచ్చినా దూరభారంతో ఉద్యోగాలను వదులుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ విశాఖ కేంద్రంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం ఆహ్వానించదగినదే.
Also Read: Governor Tamilisai- KCR: కేసీఆర్, గవర్నర్ తమిళిసై.. ఓ అజ్ఞాత ఐఏఎస్.. లొల్లి ముదిరిందిలా!
విశాఖలో ఏర్పాటు చేసే కార్యాలయంలో వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలుస్తోంది. దీంతో నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. దేశంలోని నాలుగు నగరాలను టైర్ 2 కింద ఎంపిక చేయగా అందులో వివాఖ కూడా ఉండటం గమనార్హం. దీంతో ఉత్తరాంధ్ర ప్రజల కోరిక మేరకు ఇన్ఫోసిస్ కార్యాలయం ఏర్పాటుతో అందరికి మేలు జరగనుంది. ఉద్యోగావకాశాలతో ఉపాధి పెరిగి మరింత మందికి లబ్ధి చేకూరనుందని తెలుస్తోంది.

మహిళలకు కూడా మంచి సావకాశమే. ఇన్నాళ్లు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చినా వెళ్లేందుకు వారు వెనుకాడటంతో చాలా మంది ఉద్యోగాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ సంస్థ కార్యాలయం ఏర్పాటుతో మహిళలకు మరింత చేరువ కానుంది. అందుకే ఐటీ పరిశ్రమలు విశాఖలో కూడా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఏపీలో ముఖ్యమైన నగరంగా విశాఖ గుర్తింపు పొందిన ఐటీ సంస్థలు మాత్రం ఇక్కడ సంస్థలు నెలకొల్పేందుకు ముందుకు రాలేదు. దీంతోనే విశాఖ ఉపాధి కల్పనకు కేంద్రంగా ఉండలేకపోయిది.
ఇన్ఫోసిస్ సంస్థను మధురవాడలో ఐటీ హిల్స్ లో గానీ లేదా ఏదైనా బహుళ అంతస్తుల భవనంలో గానీ ఏర్పాటు చేసేందుకు సంస్థ సిద్ధమైంది. వచ్చే సెప్టెంబర్ లోగా కార్యాలయ ప్రారంభం గురించి ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది. ఐటీ పరిశ్రమ ఏర్పాటుతో విశాఖ రూపురేఖలే మారనున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఎంతో మందికి ఉపాధి లభించి వారి జీవన విధానం కూడా మారుతుందని ఆకాంక్షిస్తున్నారు.
Also Read:Congress Ready Early Elections: ముందస్తుకు కాంగ్రెస్ సమాయత్తం.. అభ్యర్థుల జాబితా రెడీ!!
[…] […]