Rishabh Pant Injured: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కురీ వద్ద అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ప్రాణ రక్షణ కోసం పంత్ కారు నుంచి దూకేశాడు. తరువాత కాసేపటికే కారు దగ్ధమైంది. కారులోనే ఉండి ఉంటే అతడికి ప్రాణాపాయం ఉండేది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో వైరల్ అవుతున్నాయి. గురుకుల్ నర్సన్ ప్రాంతంలో పంత్ కారు డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

ప్రమాదం తరువాత పంత్ ను ఆస్పత్రిలో చేర్పించారు. పంత్ కాలుకు గాయాలు ఎక్కువ కావడంతో కాలు విరిగినట్లు చెబుతున్నారు. వెన్ను, వీపుకు తీవ్ర గాయాలు అయినట్లు వైద్యులు చెప్పారు. పంత్ కారులో దూకేయడం వల్లే ప్రాణాపాయం తప్పింది. పంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. పంత్ ఆరోగ్య పరిస్థితిపై నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టత ఇచ్చారు. అతడు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం పంత్ చికిత్స పొందుతున్నాడు.
https://twitter.com/dharmendra_lmp/status/1608706460757917696?s=20&t=pOaLOmAymCrC8c5cOAv4Ug
అతడికి సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ కు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తరువాత పంత్ ను 108 సహాయంతో రూర్కీ ఆస్పత్రికి తరలించారు. పంత్ నుదురు, కాలికి గాయాలు అయినట్లు ఎస్పీ దేహత్ స్వప్న కిషోర్ సింగ్ తెలిపారు. రూర్కీ నుంచి డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రికి రెఫర్ చేయడంతో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. జనవరి మొదటివారంలో పంత్ శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఎంపికయ్యాడు.

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాద దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. అతివేగంగా ప్రయాణిస్తున్న అతడి బీఎండబ్ల్యూ కారు రోడ్డుపక్కనే ఉన్న రెయిలింగ్ ను ఢీకొట్టింది. 30 మీటర్ల రెయిలింగ్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ వెంటనే కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్ ప్రమాదం జరగగానే కారును తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద సమయంలో పంత్ నే కారు నడిపినట్లు సమాచారం. ప్రమాదం జరగగానే కొందరు వాహనదారులు ఆగి పంత్ ను డివైడర్ పై పడుకోబెట్టారు. పంత్ ప్రమాద దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అతడు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
This video is told to be of Rishabh Pant's recent accident in Uttarakhand. Vehicle can be seen on fire and Pant is lying on the ground. @TheLallantop pic.twitter.com/mK8QbD2EIq
— Siddhant Mohan (@Siddhantmt) December 30, 2022
భారత్, శ్రీలంక మధ్య వన్డే, టీ20 సిరీస్ లు జరగనున్నాయి. రెండు సిరీస్ ల నుంచి పంత్ తప్పుకున్నాడు. అతడిని దూరం పెట్టడానికి బీసీసీఐ కారణాలు మాత్రం చెప్పలేదు. పంత్ బెంగుళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ లో రిపోర్టు చేయాల్సిందిగా బీసీసీఐ కోరింది. ఇంతలోనే ప్రమాదం జరగడంతో అందరు ఆందోళనకు గురయ్యారు. టీమిండియాకు మరో వికెట్ దూరం కావడంతో భవిష్యత్ పై బెంగ పట్టుకుంది. పంత్ ఉంటేనే జట్టు విజయాలు సాధిస్తుందని అనుకోవడంతో ఇప్పుడు ఏం చేస్తారో తెలియడం లేదు.
See this Video of Rishabh's accident time,the Car is burning
Location is Nasan VillageGet well soon champ ♥️#RishabhPant pic.twitter.com/qv7aBc2Pev
— Shauryx (@Kohli_Devotee) December 30, 2022