Indian Govt New Scheme: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తాజాగా మరో కొత్త స్కీమ్ ను అమలు చేయడానికి సిద్ధమైంది. దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త స్కీమ్ ను అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ స్కీమ్ లో భాగంగా ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రులను గంట సమయంలోగా ఆస్పత్రికి తీసుకెళ్లడం ద్వారా రివార్డును పొందే అవకాశం ఉంటుంది.

గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తీసుకెళితే ఈ స్కీమ్ ద్వారా 5,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలలో మరణించే వాళ్ల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అక్టోబర్ 15వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా దేశంలోని ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ స్కీమ్ గురించి తెలియజేసింది.
ప్రతి సంవత్సరం లక్షన్నర మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బులతో పాటు ఆస్పత్రిలో గాయపడిన వ్యక్తిని చేర్పించిన వ్యక్తికి సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. రోడ్డు ప్రమాదాలలో గాయాలపాలైన వారిని త్వరగా ఆస్పత్రిలో చేర్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం టాప్ 10 మోస్ట్ హెల్పర్లకు మరో తీపికబురు అందించింది. ఈ స్కీమ్ ద్వారా రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. టాప్ 10 మోస్ట్ హెల్పర్లు లక్ష రూపాయల నజరానా పొందే అవకాశం ఉంటుంది.