India vs West Indies: టీమిండియా అదరగొడుతోంది. విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇంగ్లండ్ లో మొదలైన విజయాల జోరు వెస్టిండీస్ లో కూడా తగ్గడం లేదు. దీంతో ఆతిథ్య జట్టుకు ముచ్చెమటలు పట్టించింది. మూడు వన్డేల సిరీస్ లో రెండు వన్డేలు గెలిచి కప్ ఇప్పటికే సొంతం చేసుకుంది. కరేబియన్ జట్టుకు నిరాశే మిగిల్చింది. త్వరలో జరిగే టీ20 ప్రపంచ కప్ పోటీలకు సమఉజ్జీ అయిన జట్టును తయారు చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో టీమిండియా విజయాలు అందరికి ఆనందాన్ని మిగుల్చుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ లో కూడా ఇదే తీరుగా విజయాలు సాధించి కప్ గెలుచుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

టీమిండియా 2-0 తేడాతో కప్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 311 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో కప్ సొంతం చేసుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వన్డే ఫార్మాట్ లో వెస్టిండీస్ కు ఇది ఎనిమిదో ఓటమి కావడం విశేషం. పది ఓవర్లలోనే భారత్ స్కోరు వంద దాటడంతో అదే ఊపును కొనసాగించింది. పరుగుల వేటలో ఎక్కడా తగ్గలేదు.
ఈ మ్యాచ్ లో అక్షరపటేల్ ఫామ్ లోకి రావడం ప్లస్ అయింది. శ్రేయాస్ అయ్యర్, శాంసన్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అక్షర పటేల్ 5 సిక్సులు, 3 ఫోర్లతో 64 పరుగులు చేయడం సంచలనం కలిగించింది. దీంతో వెస్టిండీస్ పతనం ఖాయమైంది. టీమిండియా సమష్టి రాణింపుతో విజయం సాధ్యమైంది. టీమిండియా విజయంతో అందరు ఫిదా అయ్యారు. విదేశాల్లో భారత్ చూపిస్తున్న విజయాల జోరుకు అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇంగ్లండ్ లో టీ20, వన్డే సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా అదే తీరుగా విజయాల సాధిస్తోంది. ఫలితంగా వెస్టిండీస్ ను కూడా చిత్తు చేసి మూడు వన్డేల్లో భాగంగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంది. కరేబియన్ జట్టును వైట్ వాష్ చేయాలని భావిస్తోంది. ఇందుకు గాను మూడో వన్డేలో కూడా విజయం సాధించి తీరాలని వ్యూహాలు రచిస్తోంది. ఆటగాళ్లు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. ఇంకా టీ 20 మ్యాచుల్లో కూడా ఇదే తీరుగా జోరు సాగించాలని ఉవ్విళ్లూరుతోంది.
Also Read:Chiranjeevi- Murali Mohan: చిరంజీవి పై విష ప్రయోగం నిజమే.. మురళీమోహన్ షాకింగ్ కామెంట్స్
[…] […]