Kidney Stones: కిడ్నీలలో రాళ్లు ఉన్నవాళ్లు తినకూడని ఆహార పదార్థాలు ఇవే?
Kidney Stones: మనలో చాలామందిని కిడ్నీలో రాళ్ల సమస్య వేధిస్తూ ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారు. పొత్తికడుపులో నిరంతర నొప్పి, తరచుగా మూత్ర విసర్జన, వికారం,బలహీనత, మైకం, ఇతర లక్షణాలు ఉంటే కిడ్నీలో రాళ్ల సమస్య కారణం కావచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధ పడేవాళ్లు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడేవాళ్లు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. […]

Kidney Stones: మనలో చాలామందిని కిడ్నీలో రాళ్ల సమస్య వేధిస్తూ ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నారు. పొత్తికడుపులో నిరంతర నొప్పి, తరచుగా మూత్ర విసర్జన, వికారం,బలహీనత, మైకం, ఇతర లక్షణాలు ఉంటే కిడ్నీలో రాళ్ల సమస్య కారణం కావచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధ పడేవాళ్లు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది.
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడేవాళ్లు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. చైనీస్, మెక్సికన్ ఫుడ్స్‌లో ఉప్పును ఎక్కువగా వినియోగిస్తారు. ఈ ఆహారానికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడుతున్న వాళ్లు మాంసాహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. నాన్-వెజ్ డైట్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రోటీన్ కిడ్నీలపై చెడు ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి.
Also Read: India vs West Indies: అక్షర్ తుఫాన్ ఇన్నింగ్స్ కు కొట్టుకుపోయిన వెస్టిండీస్..
నాన్-వెజిటేరియన్ డైట్‌లో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే స్టోన్ పరిమాణం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నవాళు చాక్లెట్లకు దూరంగా ఉంటే మంచిది. చాక్లెట్ లో ఉండే ఆక్సలేట్ వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. చాక్లెట్లకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది.
కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. పాలకూర, తృణధాన్యాలు, చాక్లెట్, టమోటాలలో ఆక్సలేట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీటిని తినడం మానుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Also Read: Anushka Shetty Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి..పెళ్ళికొడుకు ఎవరో తెలుసా?
Recommended Videos
