Homeఎంటర్టైన్మెంట్Anushka Shetty Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి..పెళ్ళికొడుకు ఎవరో తెలుసా?

Anushka Shetty Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి..పెళ్ళికొడుకు ఎవరో తెలుసా?

Anushka Shetty Marriage: స్వర్గంలో ఉండే అప్సరస ని తలపించే అందం తో అద్భుతమైన అభినయం తో కోట్లాది మంది అభిమానులను సంపాధించుకున్న స్టార్ హీరోయిన్ అనుష్క..అక్కినేని నాగార్జున హీరో గా నటించిన సూపర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది..కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అనుష్క..కోడి రామకృష్ణ దర్శకత్వం లో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన అరుంధతి చిత్రం అప్పట్లో ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా అప్పట్లో ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిలిచింది..ఆ సినిమా తర్వాత నుండి అనుష్క కి వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి..అలా ఆమె సౌత్ ఇండియా లోనే లేడీ సూపర్ స్టార్ స్టేటస్ ని అందుకుంది..అయితే గత కొంతం కాలం నుండి ఆమె సినిమాలు చెయ్యడం పూర్తి గా మానేసింది.

Anushka Shetty Marriage
Anushka Shetty

ఆమె నటించిన ఆఖరి చిత్రం ‘నిశ్శబ్దం’..థియేటర్స్ లో కాకుండా నేరుగా OTT లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది..ఇక ఆ తర్వాత ఈమె నవీన్ పోలిశెట్టి హీరో గా UV క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కే ఒక సినిమా లో నటించడానికి ఒప్పుకుంది..కానీ ఆమె ఈ సినిమా నుండి కూడా తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..భవిష్యత్తులో కూడా ఆమె సినిమాలు చేసే ఉద్దేశ్యం లో లేదు..దీనికి కారణం ఆమె పెళ్లి చేసుకోబోతుండడమే అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..ప్రముఖ స్టార్ హీరో ప్రభాస్ తో ఈమె ప్రేమలో ఉందని..డేటింగ్ కూడా చేసిందని..త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని..ఇలా పలు రకాల వార్తలు ఎంతో కాలం సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి.

Also Read: Chiranjeevi- Murali Mohan: చిరంజీవి పై విష ప్ర‌యోగం నిజమే.. ముర‌ళీమోహ‌న్ షాకింగ్ కామెంట్స్

Anushka Shetty Marriage
Anushka Shetty

అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అటు ప్రభాస్..ఇటు అనుష్క మీడియా కి పలు సందర్భాలలో తెలిపారు..అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే అనుష్క బెంగళూరు కి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్లాడబోతున్నట్టు తెలుస్తుంది..ఈ ఏడాది చివర్లో ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుందని..త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు తెలియచెయ్యబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read:Ramarao On Duty Pre Release Event: అతను దక్షిణ భారత దేశంలోనే గొప్ప నటుడు – రవితేజ
Recommended Videos

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular