Liver Healthy Food: మన శరీరంలో కాలేయం ముఖ్యమైన అవయవం. 24 గంటలు పనిచేసే వాటిలో ఇది ఒకటి. ఉదరంలో కుడి భాగంలో ఉంటుంది. ఇది పాడైపోయిందంటే ఇక ప్రాణాలు పోవాల్సిందే. మరో మార్గం లేదు. లివర్ మూడొంతులు పాడైపోయినా దానంతటదే రిపేర్ చేసుకుంటుంది. పావు వంతు బాగున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదే కాలేయం ప్రత్యేకత.
జీర్ణం కావడానికి..
కాలేయం మనం తీసుకున్న ఆహారం జీర్ణం చేస్తుంది. శరీరంలోని చక్కెర, ప్రొటీన్ శాతాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి మలినాలను తొలగించడంలో సాయపడుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను తీసుకోవాలి. అవేంటో తెలుసుకుని వాటిని తినడం వల్ల మనకు మేలు కలుగుతుంది.
వెల్లుల్లితో..
కాలేయ సమస్యలు ఉన్నవారు వైద్యులు సూచనల మేరకు మందులు వాడుకోవాలి. దీంతో కాలేయాన్ని బాగు చేసుకోవడానికి మనం తీసుకునే ఆహారాలే ఉపయోగపడతాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు లివర్ ను బాగు చేయడంలో సాయపడతాయి. ఇందులో ఉండే సెలీనియం వ్యర్థాలను బయటకు పంపడంలో దోహదపడుతుంది. ప్రతి రోజు ఉదయం పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
తృణ ధాన్యాలు
తృణ ధాన్యాల్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆకుకూరల్లో కూడా ఎన్నో ప్రొటీన్లు ఉంటాయి. పాలకూరలో మంచి విటమిన్లు ఉండటం వల్ల దీంతో కాలేయంను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇంకా గ్రీన్ టీ తాగడం వల్ల కూడా లివర్ ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల లివర్ లోని కొవ్వును కరిగిస్తుంది.
పసుపు
పసుపు కూడా లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రతి రోజు పాలల్లో పసుపు కలుపుని తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. కాలేయాన్ని బాగు చేసే ఆహారాలు తీసుకుంటే పది కాలాలపాటు అది మనకు సాయపడుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే సంగతి.