Lic Jeevan Anand: రోజుకు రూ.73తో రూ.10 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే?

Lic Jeevan Anand: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ పాలసీలలో జీవన్ ఆనంద్ పాలసీ కూడా ఒకటి కాగా రిస్క్ లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ పాలసీలో రోజుకు కేవలం 73 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా 10 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే […]

Written By: Kusuma Aggunna, Updated On : February 6, 2022 5:51 pm
Follow us on

Lic Jeevan Anand: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ పాలసీలలో జీవన్ ఆనంద్ పాలసీ కూడా ఒకటి కాగా రిస్క్ లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ పాలసీలో రోజుకు కేవలం 73 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా 10 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.

ఈ పాలసీని తీసుకున్న వాళ్లు జీవితకాల ప్రమాద బీమా కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు కాగా 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఈ పాలసీలో డబ్బులను ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పాలసీకి ప్రీమియం చెల్లించడానికి వార్షికం, అర్థ వార్షికం, త్రైమాసికం, నెలవారీ ఆప్షన్లు ఉన్నాయి.

ఆదాయాన్ని బట్టి ఈ పాలసీని తీసుకున్న వాళ్లు ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు రుణ సదుపాయం కూడా ఉంటుంది. 24 సంవత్సరాల వయస్సులో 21 సంవత్సరాల టర్మ్ తో 5 లక్షల రూపాయలకు పాలసీని తీసుకుంటే 26,815 రూపాయలు వార్షిక ప్రీమియంగా ఉండనుంది. 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 10.33 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

పాలసీ సరెండర్ వాల్యూపై 90 శాతం క్రెడిట్ ను లోన్ రూపంలో పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోతే నామినీ డెత్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.