Ram Charan: ”పుష్ప” సినిమాతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం రష్మిక పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ”పుష్ప” సినిమా నేషనల్ వైడ్‌గా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో రష్మిక రేంజ్ బాలీవుడ్ వరకు చేరింది. అయితే తాజాగా రష్మిక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. చెర్రీ కొత్త సినిమాలో రష్మికను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, చరణ్ ప్రస్తుతం విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ తీసుకున్నారు. కాబట్టి.. చరణ్ – రష్మిక కాంబినేషన్ ఈ సినిమా కోసం అయితే కాదు.
Also Read: ఇండియన్ ఆర్మీలో 41 ఉద్యోగ ఖాళీలు.. పదో తరగతి అర్హతతో?
మరి ఏ సినిమా కోసం వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు ?. ఇప్పటికీ అయితే.. చరణ్ తన తర్వాత
సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోతున్నాడు. గౌతమ్ ఆల్ రెడీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కథ కూడా చెప్పాడు. చరణ్ కూడా గౌతమ్ తిన్ననూరి కథ విని, సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

కాబట్టి.. ఈ సినిమాలోనే రష్మిక మండన్నాను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి తాజా అప్ డేట్ ప్రకారం గౌతమ్ తిన్ననూరి సమ్మర్ నుంచి ఈ సినిమా పై కూర్చోనున్నాడు. ఇక క్రేజీ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ తో గౌతమ్ ఈ సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ఎలాగూ గౌతమ్, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. పైగా ఈ సినిమాని కూడా పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. అన్నిటికి మించి గౌతమ్ తన ‘జెర్సీ’ సినిమాని హిందీలోకి కూడా రీమేక్ చేస్తున్నాడు. హిందీలో గౌతమ్ తిన్ననూరికి మంచి మార్కెట్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే, చరణ్ – గౌతమ్ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో అమితాశక్తి నెలకొని ఉంది.