Facebook Profile: సామాజిక మాధ్యమాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సాంకేతిక రంగం విస్తృతమవుతోంది. దీంతో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. మనకు కావాల్సిన ఆనందం ఇందులోనే లభిస్తున్నాయి. దీంతో ప్రపంచంలోని చాలా మంది వీటిని ఆశ్రయిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో సామాజిక మాధ్యమాల ప్రభావం గణనీయంగా పెరిగింది. ఫేస్ బుక్ లో ప్రాంతాలు, వంటకాలు, పుస్తకాలు, సినిమాలు చూసే అవకాశం ఉంది. దీంతో ఫేస్ బుక్ ఖాతా తెరిచేందుకు యూజర్లు వాటిని నింపేందుకు చాలా సమయం పడుతోంది. ఇప్పుడు ఫేస్ బుక్ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

యూజర్ ప్రొఫైల్ లో మతపరమైన, రాజకీయ పరమైన అభిప్రాయాలతోపాటు చిరునామా, జెండర్ వివరాలు ఇకపై తెలపాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికే పంపించిన యూజర్లకు ఫేస్ బుక్ ప్రత్యేకంగా నోటిఫికేషన్లు పంపిస్తోంది. భవిష్యత్ లో ఈ నాలుగు వివరాలు కనిపించవు. ఖాతా తెరిచే వారు ఇవి తెలపాల్సిన పనిలేదు. ఫేస్ బుక్ యూజర్లకు అనుకూలంగా ఉండేందుకు కొన్ని కాలమ్స్ తొలగించింది. యూజర్ మత, రాజకీయ అభిప్రాయాలతో పాటు అడ్రస్, జెండర్ వివరాలు పొందుపరచాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఈ నిబంధన డిసెంబర్ 1న అమల్లోకి రానుంది. సమాచారాన్ని ఇతరులకు షేర్ చేసేటప్పుడు సమస్యలు ఉండవు. ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకునేందుకు ఇంకా వేరే కారణాలు ఉన్నాయనే వాదన కూడా వస్తోంది. మత, రాజకీయ వివరాల ఆధారంగా ఆన్ లైన్ లో వేధిస్తున్నారనే ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకుందని పలువురు చెబుతున్నారు. ఫేస్ బుక్ తీసుకున్న నిర్ణయంతో యూజర్లకు ప్రయోజనం కలుగుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఫేస్ బుక్ కు ఉన్న స్థానం ఏంటో అందరికి తెలిసిందే.

ప్రతి వారికి ఫేస్ బుక్ ఖాతా ఉంది. ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లతో పోల్చితే ఫేస్ బుక్ ముందంజలో నిలుస్తుంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అందరు ఫేస్ బుక్ ను వాడుతున్నారు. తమ ఖాతాల్లో వచ్చిన సమాచారాన్ని సేకరించుకుని వారికి కావాల్సిన విషయం రాబట్టుకుంటున్నారు. భవిష్యత్ లో ఫేస్ బుక్ మరిన్ని ప్రయోజనాలు యూజర్లకు కలిగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.