Karthi Sardar Closing Collections: తమిళ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ చిత్రం ‘సర్దార్’ తెలుగు లో చాలా సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ స్టేటస్ ని అందుకుంది..దివాళి కానుకగా విడుదలైన నాలుగు సినిమాలలో ఒకటిగా వచ్చినప్పటికీ కూడా కంటెంట్ పరంగా బలంగా ఉండడం తో సర్దార్ చిత్రం విజయం సాధించింది..ఈ చిత్ర దర్శకుడు గతం లో విశాల్ తో తీసిన ‘అభిమన్యుడు’ అనే సినిమా తెలుగు లో ఘానా విజయం సాధించిన సంగతి మనకి తెలిసిందే..ఆ తర్వాత ఆ దర్శకుడి నుండి వచ్చిన రెండవ తెలుగు డబ్బింగ్ చిత్రమిది.

కార్తీ ద్విపాత్రాభినయం లో అద్భుతంగా నటించాడు..కథ లో ఒక గొప్ప సందేశం తో పాటుగా థ్రిల్లింగ్ కి గురి చేసే విధంగా స్క్రీన్ ప్లే ఉండడం తో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అంటున్నారు విశ్లేషకులు..ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం తెలుగు క్లోసింగ్ కలెక్షన్స్ ఎంత వరుకు వచ్చాయో చూద్దాం.
ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ని అక్కినేని నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద 5 కోట్ల 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసాడు..నాలుగు సినిమాలు ఈ చిత్రానికి క్లాష్ వచ్చేసరికి థియేటర్స్ తక్కువ అవ్వడం వల్ల బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని అనుకున్నారు..కానీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాకుండా లాభాల వర్షం కూడా కురిపించింది..ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు వెర్షన్ క్లోసింగ్ కలెక్షన్లు 8 కోట్ల రూపాయిల వరుకు ఉంటుందని అంచనా.

అంటే దాదాపుగా రెండు కోట్ల 50 లక్షల రూపాయిలు లాభాలు వచ్చాయి అన్నమాట..ఒకవేళ క్లాష్ లో కాకుండా వేరే టైం లో ఈ చిత్రం విడుదల అయ్యుంటే మరింత ఎక్కువ వసూళ్లు వచుండేవని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..ఇటీవలే ఈ చిత్రాన్ని ఆహా మీడియా లో అప్లోడ్ చేసారు..డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది.