Importance Of Financial Planning In Youth: డబ్బు విషయంలో కొందరికి చాలా రకాల అభిప్రాయాలు ఉంటాయి. కానీ జీవితాన్ని నడిపించేది డబ్బు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్క అవసరం డబ్బుతోనే తీరుస్తుంది. అంతేకాకుండా డబ్బులేకుంటే ఎలాంటి అవసరాలు తీరవు. అయితే డబ్బు సంపాదించడానికి చాలామంది చాలా రకాలుగా మార్గాలు ఎన్నుకుంటారు. ఈ క్రమంలో కొందరు మాత్రమే కావాల్సిన ఆదాయాన్ని పొందుతారు. మిగతావారు అనుకున్నదాన్ని పొందలేక పోతారు. కొందరు కష్టపడిన తమకు కావాల్సిన ఆదాయం రాదు. మరికొందరు అవకాశం ఉన్న ఏ పని చేయకుండా సమయాన్ని వృధా చేసుకుంటారు. అయితే ఇలా సమయాన్ని వృధా చేసుకునేవారు తమకు సమాజంలో గుర్తింపు కావాలని అనుకునే అర్హత లేదు. ఎందుకంటే?
ఎవరికైనా సమాజంలో గుర్తింపు కావాలని కోరుకుంటారు. బయటకు వెళ్ళినప్పుడు నలుగురితో మాట్లాడడం.. నలుగురితో పరిచయం చేసుకోవడం వంటివి కావాలని చేస్తారు. అయితే అందరితో మాట్లాడిన కొందరు మాత్రమే ఆప్యాయంగా ఉంటూ.. అవసరాలకు అందుబాటులో ఉంటారు. మిగతావారు మాత్రం ఎదుటి వ్యక్తి డబ్బును చూసి తర్వాత ఇస్తారు. డబ్బు ఉంటేనే విలువ ఇస్తారు. డబ్బు లేకుంటే ఏమాత్రం పట్టించుకోరు. ముఖ్యంగా ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు.. డబ్బు ఉంటే ఎదుటివారే దగ్గరికి వచ్చి పలకరిస్తారు.. డబ్బు లేకపోతే ఎవరూ పట్టించుకోరు. మరి డబ్బు ఉండడానికి ఏం చేయాలి?
Also Read: Karthika Deepam: నేనేం పాపం చేశాను అత్తయ్య అంటూ ఎమోషనల్ అయిన దీప.. బారసాల ఏర్పాట్లలో మోనిత..!
అవసరాల కోసమో.. అభివృద్ధి కోరుకునేవారు.. డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అయితే కొందరు మాత్రమే డబ్బులు సంపాదించి వాటిలో కొంత భాగం ఖర్చు పెట్టి మిగతాది పొదుపు చేస్తూ ఉంటారు. మిగతావారు మాత్రం ఎంత డబ్బు సంపాదిస్తే అంత ఖర్చు పెడతారు. తాత్కాలికంగా అవసరాలు తీరడానికి.. జల్సాగా ఉండడానికి డబ్బంతా ఖర్చు పెడతారు. మీరు భవిష్యత్తు గురించి ఏమాత్రం పట్టించుకోరు. కానీ డబ్బు లేని సమయంలో వీరికి డబ్బు విలువ తెలుస్తుంది. అప్పుడు ఎవరు పట్టించుకోకపోవడంతో తీవ్రంగా ఆవేదన చెందుతారు. అంతేకాకుండా డబ్బు సకల అవసరాలను తీరుస్తుంది. అందువల్ల భవిష్యత్తు తరాల కోసం డబ్బులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా కొన్ని సుఖాలను పక్కనపెట్టి.. భవిష్యత్తులో జరిగే అవసరాల కోసం డబ్బులు దాచడం వల్ల పది రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా డప్పు రెట్టిపోయిన తర్వాత సమాజంలో గుర్తింపు కూడా వస్తుంది.
ధనవంతుడిగా ఉన్న సమయంలోనే కొత్త స్నేహితులు వస్తారు.. కొత్త పరిచయాలు అవుతాయి.. ఉన్న డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదే ఏ మాత్రం డబ్బు లేకపోతే మాత్రం తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల డబ్బు సంపాదించే విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఉండాలి. అంతేకాకుండా డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉండాలి. అప్పుడే సమాజంలో కావలసిన గుర్తింపు వస్తుంది.