Jobs: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. టీచింగ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిజైన్, మ్యాథమేటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు ఇతర విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. 35 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. ఆన్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: Pawan Kalyan: డబ్బుల కోసం ఇంతకు దిగజారుతారా.. జగన్ పై పవన్ ఫైర్
అర్హత, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు తుది ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 1,01,500 నుంచి రూ. 1,59,100 వరకు వేతనంగా చెల్లిస్తారని సమాచారం అందుతోంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది.
https://iith.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీస్థాయిలో బెనిఫిట్ కలగనుంది.
Also Read: Nandamuri Balakrishna: యాక్షన్ లేని బాలయ్య సినిమా ఏమిటో మీకు తెలుసా ?