https://oktelugu.com/

Unmarried Actresses: పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన హీరోయిన్లు ఎవరో తెలుసా ?

Unmarried Actresses: సినిమా రంగంలో వారికి త్వరగా పెళ్లిళ్లు కావు. ఇక వాళ్లకు డేటింగ్ లు, షూటింగ్ లు చాలా సర్వసాధారణమైన విషయం. నచ్చిన వారితో నచ్చినట్టు కలిసి ఉంటారు, నచ్చకపోతే మరుక్షణం విడిపోతారు, మొత్తానికి రంగుల ప్రపంచంలో ఉన్న వారి జీవితాల్లో ఎన్నో రంగులతో పాటు మరెన్నో లొసుగులు కూడా ఉంటాయని ఈ కింద హీరోయిన్ల జీవితాలను గమనిస్తే అర్ధం అవుతుంది. ముఖ్యంగా హీరోయిన్లకు ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి చాలా కామన్. అయితే.. కొంతమంది […]

Written By:
  • Shiva
  • , Updated On : March 21, 2022 / 10:31 AM IST
    Follow us on

    Unmarried Actresses: సినిమా రంగంలో వారికి త్వరగా పెళ్లిళ్లు కావు. ఇక వాళ్లకు డేటింగ్ లు, షూటింగ్ లు చాలా సర్వసాధారణమైన విషయం. నచ్చిన వారితో నచ్చినట్టు కలిసి ఉంటారు, నచ్చకపోతే మరుక్షణం విడిపోతారు, మొత్తానికి రంగుల ప్రపంచంలో ఉన్న వారి జీవితాల్లో ఎన్నో రంగులతో పాటు మరెన్నో లొసుగులు కూడా ఉంటాయని ఈ కింద హీరోయిన్ల జీవితాలను గమనిస్తే అర్ధం అవుతుంది. ముఖ్యంగా హీరోయిన్లకు ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి చాలా కామన్. అయితే.. కొంతమంది భామలు మాత్రం ప్రేమతోనే జీవితాంతం కాలక్షేపం చేస్తున్నారు.

    ఘాడంగా ప్రేమించినా పెళ్ళికి మాత్రం చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ అందచందాలతో ప్రేక్షకులను అందాల కలల ప్రపంచంలో విహరింప చేసే ఈ అందాల తారలు, వయసు పై పడినా ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు, మరి 45 ఏళ్ళు దాటినా ఈ ముదురు హీరోయిన్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ? ఇంతకీ అసలు వాళ్లెవరు ? అలాగే వాళ్ల బాధ ఏమిటో చూద్దాం.

    Also Read: RRR Movie: “ఆర్ఆర్ఆర్” ప్రీమియర్ షో.. టికెట్ రేటు ఎంతంటే ?

    టబు :

    ఈ లిస్ట్ లో ముందుగా ముచ్చటించుకోవాల్సిన పేరు.. ‘టబు’. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పటి టాప్ హీరోయిన్, ఏభై ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి వల్ల తన సంతోషాలు సరదాలు కోల్పోతాను అని, అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాను అని ఓ సందర్భంలో టబు చెప్పింది. ఇక ఇప్పటికీ టబు బోల్డ్ పాత్రల్లో నటిస్తోంది. మనసుకు నచ్చిన సరైన పార్ట్నర్ దొరకినా డేటింగ్ చేస్తోంది గాని, పెళ్లి మాత్రం చేసుకోదట.

    సుష్మితా సేన్ :

    బోల్డ్ సమాజంలో ఎదురులేని మరో ముదురు హీరోయిన్ సుష్మితా సేన్. వయసు అయిపోతున్నా ఇంకా ఒంటరి జీవితాన్నే హాయిగా గడుపుతూ టైం పాస్ ఛేసోంది. అయితే, ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. కానీ గత ఏడాది వరకు రొమన్ షాల్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఇప్పుడు అతన్ని వదిలేసింది. ప్రస్తుతానికి అయితే ఒంటరి బతుకులోని బతుకు ఉందని స్పీచ్ లు ఇస్తోంది.

    శోభన :

    ఇప్పటికీ మంచి క్లాసిక్ డ్యాన్సర్ గానే మిగిలిపోయింది. అయితే, ఒకప్పుడు శోభన అంటే మంచి క్లాస్ హీరోయిన్ అని పేరు. ఇక 51 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదు. కారణం.. నాట్యం పై ఆమెకున్న అమితమైన అభిరుచేనట. తన జీవితాన్ని నాట్యానికి త్యాగం చేశాను అని కబుర్లు కూడా చెబుతుంది.

    Shobana

    అమీషా పటేల్ :

    టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం ఛాన్స్ లు లేక అమీషా చాలా ఇబ్బందులు పడుతుంది. ఇక తన జీవితంలో ఎంతమంది మగాళ్లను చూసినా తనకు సరైన పార్ట్నర్ అనే భావన కలగలేదు అని, అందుకే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు రాలేదు అని చెబుతుంది.

    Ameesha Patel

    నగ్మా :

    టాలీవుడ్ లోనే కాదు హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ లాంటి అన్నీ భాషల్లోనూ తన గ్లామర్ తో మెరుపులు మెరిపించిన అప్పటి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన భారీ అందాల తార నగ్మా. వయసు దాటిపోతున్నా ఇంకా ఒంటరిగానే ఉంది. పెళ్లి పేరు చెబితే.. పారిపోతుంది. రెండు సార్లు ప్రేమలో విఫలమైంది. అందుకే ఒంటరిగా ఉండటానికి నగ్మా అలవాటు పడిపోయింది.

    Nagma

    సితార :

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినీ లోకంలో ఒక వెలుగు వెలిగిన ఈ తరం నటి సితార. తనకంటూ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు రాలేదు. అయినా నటిగా బిజీ అయింది. పైగా వయసు అయిపోతున్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉంది. నిజానికి పెళ్లి చేసుకోవాలనుకున్నా సితారకు కాలం కలిసి రాలేదు. తనను సరిగ్గా గైడ్ చేసేవారు లేకే ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అని ఆమె బాధ పడుతూ ఉంటుంది.

    నర్గీస్ ఫక్రీ :

    నర్గీస్ ఫక్రీది అందాల కనువిందుల గురించి ఎంత మొర పెట్టుకున్నా అది ఎప్పటికీ తనవి తీరనది అని ఆమె గురించి నేటి కవులు కూడా ఆయాస పడేలా వర్ణిస్తూ ఉంటారు. ఇక తన వయసు అయిపోయినా నర్గీస్ ఫక్రీ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. కుటుంబ బంధాల పై సరైన అభిప్రాయం లేకపోవడం, అలాగే ఆమె విచ్చలవిడి ఒంటరితనానికి అడ్డుఅదుపు లేకపోవడం ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి కారణం.

    Also Read: Prabhas Radhe Shyam: సినిమా కొనుకున్న వాళ్ళు అన్యాయం అయిపోయారు

    Recommended Video:



    Tags