https://oktelugu.com/

BigBoss: బిగ్​బాస్ కంటస్టెంట్​ ప్రియాంకపై మెగాబ్రదర్ నాగబాబు ప్రశంసలు

BigBoss: ప్రస్తుతం రియాలిటీ షోలకు మంచి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే బిగ్​బాస్​ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఈ షో కొందరి జీవితాలు, జాతకాలనే మార్చేసిన సందర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా షోలో పాల్గొనే కంటెస్టంట్​ల క్రేజ్​ అమాంతం పెరిగిపోయి.. వాళ్ల గతినే మార్చేసే ప్లాట్​ఫామ్​ బిగ్​బాస్​.. అంతకు ముందు ఏ మాత్రం క్రేజ్​లేని వారు కూడా ఈ షోతో ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న వాళ్లూ ఉన్నారు. ప్రస్తుతం ప్రియాంక సింగ్ అలియాస్​ పింకీ కూాడా అదే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 10:36 AM IST
    Follow us on

    BigBoss: ప్రస్తుతం రియాలిటీ షోలకు మంచి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే బిగ్​బాస్​ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఈ షో కొందరి జీవితాలు, జాతకాలనే మార్చేసిన సందర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా షోలో పాల్గొనే కంటెస్టంట్​ల క్రేజ్​ అమాంతం పెరిగిపోయి.. వాళ్ల గతినే మార్చేసే ప్లాట్​ఫామ్​ బిగ్​బాస్​.. అంతకు ముందు ఏ మాత్రం క్రేజ్​లేని వారు కూడా ఈ షోతో ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న వాళ్లూ ఉన్నారు. ప్రస్తుతం ప్రియాంక సింగ్ అలియాస్​ పింకీ కూాడా అదే క్రేజ్​ను దక్కించుకుంది. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్​బాస్​ సీజన్​5లో కంటెస్టంట్​గా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. గతంలో పలు టీవీ షోల్లో పొల్గొంది. అయితే, పెద్దగా గుర్తింపు సాధించలేకపోయింది.

    BigBoss

    ప్రస్తుతం బిగ్​బాస్​తో మంచి క్రేజ్​ సంపాదించుకుంది ఈ భామ. అయితే, ఇటీవలే బిగ్​బాస్​ నుంచి ఎలిమినేషన్​ అయ్యి బయటకు వచ్చిన పింకీకి ఆమె అభిమానులు ఘన స్వాగతం పలుకుతూ హంగామా చేశారు. దీంతో ఆమెకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, ట్రాన్స్​జెండర్​గా హౌస్​లో అడుగుపెట్టిన ప్రియాంక.. తమన్నా సింహాద్రి లాగే ఎక్కువ రోజులు కొనసాగలేకపోతుందని చాలామంది భావించారు. అయితే, అందరి అంచనాలను తలకిందలు చేస్తూ.. ఏకంగా 13 వారాలు హౌస్​లో చక్రాన్ని తిప్పింది.

    Also Read: బిగ్ బాస్ సీజన్ 5 విన్న‌ర్ అత‌డే అంటున్న రాహుల్ సిప్లిగంజ్…

    కాగా, తాజాగా మెగా బ్రదర్ నాగబాబు పింకీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఒకనొక సమయంలో స్పందించారు కూాడా. అయితే ఎలినేషన్ అనంతరం నాగబాబును కలిసిన ప్రియాంక.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెపై నాగబాబు ప్రశంసలు కురిపించారు. ప్రజల హృదయాల్లో గొప్ప స్థానం దక్కించుకుందని.. హేళన ఎదుర్గొనే వారికి నువ్వొక స్ఫూర్తిగా నిలిచావని.. జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపావని పింకిని ఉద్దేశిస్తూ అన్నారు.

    Also Read: నాగార్జున గారూ.. ఆ ఆశ కూడా పోతుంది!