Cold Wave: చలి తీవ్రత వేధిస్తోంది. తీవ్రమైన చలి గాలుల ప్రభావంతో జనం వణుకుతున్నారు. చలి మంటలు వేసుకున్నా చలి ప్రభావం తగ్గడం లేదు. దీంతో ప్రజలు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులైతే ఇక చెప్పడానికి వీలు లేకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు ఇంత కనిష్ట స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇంకా రెండు మూడు రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది.
హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్నానాలు చేయడానికి గజగజ వణుకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కలవరపెడుతున్నాయి. ఏకంగా 3.5 డిగ్రీలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
చలి విపరీతంగా పెరిగిపోతోంది. సాధారణం కన్నా నాలుగైదు రెట్లు చలి తీవ్రత భయపెడుతోంది. రాబోయే మూడు రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం దారుణంగా ఉంది. గిన్నెదరిలో 3.5 ఉష్ణోగ్రత నమోదు కావడంతో జిల్లా అంతా వణుకుతోంది.
Also Read: CM Jagan: మద్యపాన నిషేధంపై జగన్ మడమ తిప్పేస్తాడా..?
మరోవైపు ఈశాన్య భారతదేశం నుంచి చలిగాలులు వీస్తుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో చలి కనిష్ట స్థాయికి పడిపోతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Also Read: Fake Lady: భార్యగా అత్తింట అడుగు పెట్టింది… ఇల్లు మొత్తం దోచుకుని పరారైంది!