Driving Licence: ప్రస్తుత కాలంలో డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరి అయిందనే సంగతి తెలిసిందే. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ను కలిసి ఉండాలి. రోజురోజుకు వాహనాలకు సంబంధించిన నిబంధనలు మారుతుండగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే జరిమానా విధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే అర్హత ఉన్నవాళ్లు ప్రస్తుతం సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ ను పొందవచ్చు.
ఈ వెబ్ సైట్ ద్వారా ఇతర సేవలను కూడా పొందే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికెట్ డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్ ఇతర సేవలను ఈ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు. వెబ్ సైట్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ ను ఎంపిక చేసుకుని కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయవచ్చు. వివరాలను నమోదు చేసిన తర్వాత డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఫోటో, సంతకం, ఆధార్, పేమెంట్ ఇతర వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసిన అనంతరం ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్లు ఈ విధంగా దరఖాస్తు చేసుకుని లైసెన్స్ ను పొందవచ్చు.