NTR Statue: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ విద్వేషాలు తారాస్థాయికి చేరాయి. ఒక పార్టీ మరో పార్టీపై విరుచుకు పడుతున్నాయి. విమర్శలైతే మరీ అధ్వానంగా తయారయ్యాయి. దీంతో విభేదాలు పెరిగాయి. ఒక పార్టీపై మరో పార్టీ దాడి చేసుకునేంత స్థాయికి చేరడం గమనార్హం. గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది. దుర్గిలో పట్టపగలే ఓ వ్యక్తి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం గమనార్హం. అతడు వైసీపీ కార్యకర్త అని తేలింది. దీంతో రెండు పార్టీల్లో ఆగ్రహ జ్వాలలు పెరిగాయి.

దీంతో అక్కడ ఉద్రిక్తలు చోటుచేసుకోగా పోలీసులు రంగ ప్రవేశం చేసి 144 సెక్షన్ విధించారు. టీడీపీ నేతలను అరెస్టు చేశారు. దీంతో టీడీపీ నేతల్లో ఆగ్రహ జ్వాలలు పెరిగాయి. మా నేత విగ్రహాన్ని కూల్చితే ఎదుటి పార్టీ వారిని అరెస్టు చేయకుండా బాధితులను అరెస్టు చేయడమేమిటని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పోలీసులపై గొడవలకు దిగుతున్నారు. దీంతో రెండు వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి.
Also Read: బాలయ్య ఫార్ములా బన్నీ పై వర్కౌట్ అవుతుందా ?
మరోవైపు తాడికొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై కూడా దాడి జరిగిందంటూ టీడీపీ నేతలు ఆందోళన చేస్తుంటే చిరుమామిళ్ల మధుబాబు, ఒప్పిచర్ల వద్ద జూలకంటి బ్రహ్మరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో దాడులకు పాల్పడిన వారిని వదిలేసి బాధితులను అరెస్టు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు.
ప్రతిపక్ష నేత విగ్రహాన్ని ధ్వంసం చేయడంలో వైసీపీ ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని తెలుస్తోంది. విద్వేషాలు రెచ్చగొట్టి పార్టీ ప్రతిష్ట మసకబారేలా చేయడానికే అధికార పార్టీ కుట్రలు పన్నుతోందని చెబుతున్నారు. అధికార పార్టీ ఆగడాలకు చెక్ పెట్టేందుకు టీడీపీ కూడా సరైన తీరుగా స్పందిస్తుందని తెలుస్తోంది. అధికార పార్టీ ఇప్పటికైనా దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
Also Read: సమంత వార్తల పై ఫీల్ అయిన పూజా హెగ్డే !