Enemies: శత్రువుతో ఇలా ప్రవర్తిస్తే విజయం మీదే..

Enemies: శత్రువును ఎప్పటికి గమనిస్తూ ఉండాలి. వారు ఎలాంటి ఎత్తులు వేస్తున్నారు? ఎలాంటి జీవితం గడుపుతున్నారు? అనేది గమనించాలి. వారి నడవడికను బట్టి మన గురించి ఎలా ఆలోచిస్తున్నారో తెలిసిపోతుంది.

Written By: Chai Muchhata, Updated On : January 19, 2024 5:42 pm
Follow us on

Enemies: అందమైన జీవితం కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, కొందరు వ్యక్తుల ప్రవర్తన వల్ల జీవితంలో అనూహ్య మార్పులు వస్తుంటాయి. దీంతో కొందరు శత్రువులు తయారవుతారు. ఒక వ్యక్తిపై శత్రుత్వం ఏర్పడినప్పుడు అతడు ఏం చేసినా నచ్చదు. అతనికి దూరంగా ఉండాలని అనిపిస్తుంది. కానీ శత్రువుతో ఎప్పటికైనా ప్రమాదం ఉంటుంది. అందువల్ల వారి విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కొన్ని విషయాల పట్ల పూర్తిగా అవగాహన ఉండాలి. లేకుంటే వారు వేసు ఉచ్చులో బలవుతారు. ఇంతకీ శత్రువు విషయంలో ఎలాంటి ఆలోచనలు చేయాలి?

నడవడిక గమనించాలి:
శత్రువును ఎప్పటికి గమనిస్తూ ఉండాలి. వారు ఎలాంటి ఎత్తులు వేస్తున్నారు? ఎలాంటి జీవితం గడుపుతున్నారు? అనేది గమనించాలి. వారి నడవడికను బట్టి మన గురించి ఎలా ఆలోచిస్తున్నారో తెలిసిపోతుంది. వారు బయటికి వెళ్లినా.. ప్రత్యేక ప్రదేశాలకు వెళ్లినా ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించాలి.

అంచనా తప్పద్దు..
శత్రువుతో ఎప్పటికైనా ప్రమాదమే. అందువల్ల వారి విషయంలో ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. వారిని లైట్ గా తీసుకోవడం వల్ల ఏ క్షణమైనా, ఏ రకంగానైనా దాడికి దిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వారి బలం, బలహీనత లను తెలుసుకొని వారి బలహీనతల ఆధారంగా వ్యూహం పన్నొచ్చు.

తెలివితో..
శత్రువు బలమైన వాడని నమ్మితే అందుకోసం ఇతర మార్గాలు ఆలోచించాలి. వారి బలహీనతల ఆధారంగా తెలివితేటలో దెబ్బతీయొచ్చు. అయితే ఒక్కోసారి ఇది పనిచేయకపోవచ్చు. అందుకోసం ఇతరుల సలహాలు తీసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి బలం కన్నా తెలివితో దెబ్బ తీయడం వల్ల ఎదుటి వారు భయపడిపోతారు.

భయం వీడాలి:
శత్రువును చూసి నిత్యం భయపడిపోతుంటే వారు మరింత కుంగదీయొచ్చు.. ఎలాంటి పరిస్థితుల్లో బలహీనతలు చెప్పకుండా ఉండాలి. అందు కోసం ఎప్పటికీ ధైర్యంగా ఉండాలి. భయపడిపోతున్న వారిని మరింత భయపెట్టేవారు చాలా మంది ఉంటారు.