https://oktelugu.com/

Skin : అప్పుడే స్కిన్ డల్ అయిపోయిందా? వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే మెరుపు పక్కా

చర్మం అందంగా, నిగనిగ లాడాలి అని ఎవరు కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరికి స్కిన్ మెరుస్తూ ఉండాలని ఉంటుంది. కానీ మెయింటెన్స్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. అప్పుడు మాత్రమే స్కిన్ ను సూపర్ గా ఉంచుకోవచ్చు.

Written By: , Updated On : February 15, 2025 / 03:00 AM IST
Skin

Skin

Follow us on

Skin : చర్మం అందంగా, నిగనిగ లాడాలి అని ఎవరు కోరుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరికి స్కిన్ మెరుస్తూ ఉండాలని ఉంటుంది. కానీ మెయింటెన్స్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. అప్పుడు మాత్రమే స్కిన్ ను సూపర్ గా ఉంచుకోవచ్చు. ఇక బిజీ షెడ్యూల్, ఫుల్ వర్క్, టెన్షన్స్ మధ్య స్కిన్ కేర్ అవసరమా? అని కొంత మంది, సమయం లేక మరికొందరు ఫేస్ ను కాస్త లైట్ తీసుకుంటారు. సరే కాస్త సమయం తీసుకొని కేర్ తీసుకుంటే డబ్బులు ఖర్చు మాత్రం ఎక్కువ చేయాల్సి వస్తుంది. డబ్బు ఖర్చు పెట్టినా మంచి రిజల్ట్ ఉంటుందా అంటే నమ్మకం లేదు దొర అనాల్సిందే. ఇన్ని కష్టాలు, కన్ఫ్యూజ్ ల కంటే ఇప్పుడు మనం ఒక సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ ల గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో చదివేయండి.

సన్ స్క్రీన్ ను కచ్చితంగా ఉపయోగించాలి. దీని వల్ల మీ స్కిన్ ను చాలా సమస్యల నుంచి బయటపడేయవచ్చు. ఎండలో వెళ్లేటప్పుడు మాత్రమే కాదు ఇంట్లో ఉన్నా సరే కచ్చితంగా సన్ స్క్రీన్ ను అప్లే చేసుకోవాలి. దీని వల్ల సూర్య కిరణాల వల్ల కలిగే సమస్యలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు చర్మ సంబంధిత నిపుణులు. ఇక దీని వల్ల సన్ డ్యామేజ్, అకాల వృద్ధాప్యాన్ని నివారించుకోవచ్చు.

మాయిశ్చరైజర్ ను కూడా ప్రతి రోజు వాడాల్సిందే. జస్ట్ రెండు నిమిషాలు ఈ స్కిన్ కేర్ రొటీన్ కోసం మీరు కేటాయించాల్సిందే. కానీ ఈ ప్రాడక్ట్ లను ఎంచుకోవడంలో మాత్రం కచ్చితంగా కాస్త జాగ్రత్త పాటించాలి. కొన్ని మీ స్కిన్ ను మరింత పాడు చేసే అవకాశం ఉంది. నిపుణుల సలహా మేరకు మంచి మాయిశ్చరైజర్ ను వినియోగించండి.

ఎక్స్‌ఫోలియేషన్ కూడా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అందుకే వారానికి 1-2 సార్లు ఇలా చేయాలి. దీని వల్ల కాంతివంతమైన ఛాయ వస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో ఎక్స్‌ఫోలియేషన్ మీకు హెల్ప్ ఫుల్ గా ఉంటుంది అంటున్నారు నిపుణులు.

యాంటీఆక్సిడెంట్లు, హైడ్రేషన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం లోపలి నుంచి మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. మీరు ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. స్కిన్ కోసం బయట నుంచి ఎంత కేర్ అవసరమో లోపల నుంచి కూడా అంతే కేర్ అవసరం. మంచి ఆహారాలను మీ బాడీకి అందివ్వాలి. క్యారెట్, బీట్రూట్ వంటివి చాలా ఉపయోపడతాయి.

ఇక డెర్మటాలజిస్ట్ లను కలిసి వారి నుంచి సలహాలు తీసుకొని మీ స్కిన్ కోసం మంచి ప్రాడక్ట్ లను ఎంచుకోవాలి. ఆహారంతో పాటు క్రీముల విషయంలో కూడా తగు జాగ్రత్తలు మస్ట్. కాబట్టి వారి సలహాలు సూచలను తీసుకోవడం వల్ల కొత్త సమస్యల నుంచి దూరంగా ఉంటారు. మరీ ముఖ్యంగా నీరు ను కూడా తీసుకోవాలి.