Winter Health Tips: చలికాలంలో వ్యాధులు చుట్టుముడతాయి. ఈ కాలంలో వైరస్ లు, బ్యాక్టీరియాలు యాక్టివ్ గా మారుతాయి. వాత, పిత్త, కఫ దోషాలు రావచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలు మెనూలో చేర్చుకోవాలి. లేదంటే ఇబ్బందులు రావచ్చు. శీతాకాలం అంటే హేమంత రుతువు ఆరంభం నుంచి శిశిర రుతువు వరకు ఉంటుంది. కఫం సమతులంగా ఉంటే కీళ్ల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, చర్మంలో నిగారింపు నిలిచి ఉంటుంది. కఫ దోశం ఏర్పడితే శ్లేష్మ సంబంధ అనారోగ్యాలు, బరువు పెరగడం, నీరసం వస్తాయి. చలికాలంలో వీటిని నివారించాలంటే ఆహార నియమాలు పాటించాలి.

సీజన్లు మారుతున్న క్రమంలో ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు ఆహారంలో గుడ్డు, నెయ్యితో చేసిన కిచిడి, వెచ్చని పాలు, నువ్వులు, చెరుకుతో చేసిన పదార్థాలు, బాదం, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం. మాంసాహారులైతే చికెన్ సూప్, నెయ్యితో వండిన ఆకుకూరలు భోజనంలో చేర్చుకోవాలి తులసి, ిమ్మ గడ్డి, అల్లం వంటి వాటితో గ్రీన్ టీ తీసుకోవాలి. చలికాలంలో ఇమ్యూనిటీ పెంచేందుకు ఇవి దోహదం చేస్తాయి. అందుకే వీటిని తీసుకుంటే ప్రయోజనాలు కలుగుతాయి.
చలికాలంలో బెల్లం వేడి చేస్తుంది. జీర్ణసంబంధమైన సమస్యలు రాకుండా చేస్తుంది. ఈ కాలంలో దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. గింజధాన్యాలు, కూరగాయలు, కిచిడి వంటివి ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇందులో ఉండే ప్రొటీన్లు మనకు లాభం చేకూరుస్తాయి. నువ్వులు కూడా వేడి చేస్తాయి. ఇందులో ఉండే ఐరన్, కాపర్, జింక్ అనేక రకాల విటమిన్లు ఉండటంతో ఇవి మంచి ఆహారమే. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ కాలంలో వీటిని ఎక్కువగా తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయనడంలో ఆశ్చర్యం లేదు.

ఈ కాలంలో ఆకుకూరలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో కూడా మనకు ఎన్నో ప్రొటీన్లు ఉండటంతో వీటిని తీసుకోవడం ఎంతో మంచిది. బచ్చలి, పాలకూర, మెంతి, ఉల్లి ఆకు వంటి వాటిని తీసుకునేందుకు మొగ్గు చూపాలి. ఇవి మన ఇమ్యూనిటీని పెంచుతాయి. పాలలో పసుపు వేసుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. చికెన్ సూప్ తీసుకోవడం చాలా మంచిది. మసాలాలు శరీరంలో వేడి పుట్టిస్తాయి. టీ, కాఫీ తాగడం వల్ల సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ వీటికి బదులుగా తులసి, అల్లం, నిమ్మగడ్డితో చేసిన హెర్బల్ టీ తాగడం మంచిది. ఈ పానీయం వెచ్చగా సౌకర్యవంతంగా ఉండటమే కాదు ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం.