Raw Food: ‘ఆరోగ్యమే మహాభాగ్యం’.. అని నిత్యం వింటూ ఉంటాం. కానీ నేటి కాలంలో ఆరోగ్యంపై చాలా మంది శ్రద్ధ వహించడం లేదు. కొందరు ఇంట్లో సాంప్రదాయంగా చేసిన వంటలను వదిలేసి.. మార్కెట్లో దొరికే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఎగబడుతున్నారు. ఇంట్లో వాటికంటే ఇవి రుచి ఎక్కువగా ఉండడంతో వీటి కోసం ఎగబడుతున్నారు. అయితే ఎక్కువగా రుచిని కలిగించేవి.. ఎక్కువగా రోగాలను కూడా తీసుకొస్తాయి.. అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ తో పాటు జంక్ ఫుడ్ లో ఎక్కువగా హాని కలిగించే కారకాలు ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరానికి హానిని కలగ జేస్తాయి. అంతేకాకుండా వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల శరరంలో కొవ్వు పేరుకుపోతుంది. కొవ్వు పేరుకుపోవడం వల్ల అనేక అనారోగ్యాలు దరి చేరుతాయి. అయితే ఈ కొవ్వును వెంటనే కోసేసే ఓ పదార్థం ఇంట్లోనే ఉంటుంది. దీనిని పచ్చిగా తినడం వల్ల మేలు జరుగుతుంది. ఇంతకీ ఆ పదార్థం ఏంటిది?
ప్రతి ఇంట్లోని మనుషుల ఆరోగ్యం వంటింట్లో ఉంటుందని అంటారు. వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆసుపత్రులకు వెళ్లే అవసరాలు రాకుండా ఉంటాయి. వీటిలో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనిని ఏదైనా ఆహారం వండుకునే సమయంలో తాలింపు వేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల మంచి రుచిని కలిగిస్తుంది. కానీ దీనిని తాలింపుతో కాకుండా పచ్చిగా తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
ఉల్లిపాయలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల ఉల్లిలో 4 మిల్లి గ్రాముల సోడియం ఉంటుంది. ఒక మిల్లి గ్రామం ప్రోటీన్ లభిస్తుంది. 9 నుంచి 10 మిల్లి గ్రాములు కార్బోహైడ్రైట్లు, 3 మిల్లి గ్రాముల ఫైబర్ లభిస్తుంది. అయితే వీటిలో ఉండే పోషకాలు శరీరానికి నేరుగా రావాలంటే తాలింపు కంటే పచ్చి ఉల్లిపాయలనే ఎక్కువగా తినాలి. పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఉండడం వల్ల సాధారణ రోగాలు దరి చేరకుండా ఉంటాయి. చిన్న వ్యాధులు అసలే ఉండవు.
ఉల్లిపాయలో ఉండే కార్పొ హైడ్రేట్స్, ఫ్లేవనాయిడ్స్ శరీరంలోని కొవ్వును వెంటనే కరిగించేలా చేస్తాయి. దీంతో రక్తంలో పేరుకుపోయిన కొవ్వు మాయమై రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా గుండె అధికంగా కొట్టుకునే సమస్య నుంచి పరిష్కారం అవుతుంది. అప్పుడు రక్తపోటు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి బయటపడొచ్చు. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు కంట్రోల్ లో ఉంటాయి. క్యాన్సర్ కారకాలను నియంత్రిస్తుంది. అయితే వీటిని ఉదయం సలాడ్ తీసుకునే సమయంలో లేదా.. మధ్యాహ్న భోజన సమయంలో ప్రత్యేకంగా తీసుకోవచ్చు. రాత్రి సమయంలో కూడా వీటిని తీసుకున్నా.. తొందరగా జీర్ణం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.