Car That Is In Such Demand: సాధారణంగా కారు కొనాలని అనుకునే వారు షో రూం కు వెళ్లి అక్కడున్న వాటిల్లో ఏదో ఒకటి ఎంచుకుంటారు. కానీ కొందరు మాత్రం తమకు నచ్చిన విధంగా ఉండాలని అనుకుంటారు. అవసరమైతే ఆ కారు వచ్చేదాకా వెయిట్ చేస్తారు. మహా అయితే ఆ కారు డెలివరీ కావడానికి నెల నుంచి 3 నెలల పాటు ఉంటుంది. కానీ ఒక కారును బుక్ చేసుకున్న తరువాత 2025 మే లోపు డెలివరీ అవుతుందని చెప్పారట. ఈ కారుకు ఎక్కువగా డిమాండ్ ఉండడంతో దీనిని పొందేందుకు ఏడాదిన్నర పాటు ఆగాల్సిందేనని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో ఆ కస్టమర్ షాక్ కు గురయ్యాడు. ఇంతకీ ఆ కారుకు ఎందుకంత డిమాండ్ ఉంది? ఇది ఏ కంపనీ కారు?
Automobile మార్కెట్లో Mahindra కార్లకు మంచి డిమాండ్ ఉటుంది. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన థార్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయతే దీనిని అప్డేట్ చేస్తూ ఈ ఏడాది ఆగస్టు 15న Thar Rox ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆగస్టు 3 నుంచే దీని బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అయితే బుకింగ్ ఓపెన్ చేసిన తరువాత 1.70 వేలు నమోదయ్యాయి. దీంతో ఈ కారు మార్కెట్లోకి రాకముందే డిమాండ్ ఏర్పడింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కారుకు డిమాండ్ పెరగడమే గానీ.. తగ్గడం లేదు.
తాజాగా ఓ కస్టమర్ Thar Rox ను బుకింగ్ చేసుకుంటే కంపెనీ నుంచి షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఆయన బుకింగ్ చేసుకున్న కారు 2026 మే లో పు వస్తుందని చెప్పారు. అంటే అప్పటిలోగా ఎప్పుడైనా రావొచ్చు అని అర్థం.అంటే Thar Roxను పొందాలంటే మరో ఏడాదిన్నర ఆగాల్సిందేనా? అని ఆ కస్టమర్ నిరాశ చెందినట్లు కొందరు పేర్కొంటున్నారు. అయితే డిమాండ్ తగిన సప్లయ్ లేకపోవడంతోనే ఈ సమస్య ఎదురైందని కొందరు అంటున్నారు.
మహారాష్ట్రలోని నాసిక్ లో Thar Rox ను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో నెలకు 9,500 SUV లను తయారు చేయగల సామర్థ్యం ఉంది. వీటిలో 3 డోర్ తో పాటు 5 డోర్ ఎస్ యూవీలతో పాటు Thar Roxను 6,000 తయారు చేస్తున్నారు. అయితే బుకింగ్ ప్రారంభానికి ముందే Thar Rox కొన్నింటిని విక్రయించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం లక్షకు పైగానే యూనిట్ల డిమాండ్ ఉంది.
Mahindra కార్లకు ఎప్పటికీ డిమాండ్ ఉటుంది. గతంలో XUV700 కార్లకు ఇలాగే డిమాండ్ ఉండేది. ఇప్పుడు Thar Rox కోసం ఎగబడుతున్నారు. అయితే అప్పుడు డిమాండ్ కు తగిన విధంగా సప్లయ్ చేశారు. కానీ ఇప్పుడు Thar Rox తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ఇప్పటి వరకు బుకింగ్ చేసుకున్న వారికి సైతం ఇంకా కారు అందలేదు. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే కంపెనీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.