https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్లోకి శివాజీ వచ్చేస్తున్నాడు, రంగం సిద్ధం.. హీటెక్కనున్న షో!

బిగ్ బాస్ సీజన్ 7లో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన శివాజీ బిగ్ బాస్ షోలో అడుగుపెడుతున్నాడన్న న్యూస్ కాకరేపుతోంది. ఆయన ఎంట్రీతో టీఆర్పీ బాక్సులు బద్దలే అంటున్నారు. బిగ్ బాస్ హౌస్ హీటెక్కడం ఖాయం అంటున్నారు. దీని వెనకున్న నేపథ్యం ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : November 2, 2024 / 12:21 PM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :  శివాజీ చిత్ర పరిశ్రమకు వచ్చి మూడు దశాబ్దాలు అవుతుంది. సుదీర్ఘ ప్రస్థానంలో శివాజీ విలక్షణ పాత్రలు చేశాడు. కెరీర్ బిగినింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. విలన్ గా సైతం మెప్పించాడు. అనంతరం హీరోగా మారి హిట్ చిత్రాలు ప్రేక్షకులకు అందించారు. శివాజీ నటించిన మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, చందన బ్రదర్స్ బొమ్మన సిస్టర్స్ మంచి విజయాలు అందుకున్నాయి. సినిమాలకు గ్యాప్ ఇచ్చి సడన్ గా పొలిటికల్ టర్న్ తీసుకున్నాడు శివాజీ.

    2014లో నారా చంద్రబాబు ఏపీ సీఎంగా అధికారం చేపట్టాడు. మొదట్లో ఆయనపై విమర్శలు చేశాడు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరకడం వలన కేంద్రంతో గట్టిగా మాట్లాడలేకపోతున్నాడని అన్నాడు. అనంతరం శివాజీ వెర్షన్ మారింది. చంద్రబాబుకు మద్దతుగా ప్రధాని మోడీ పై విమర్శలు చేశాడు. చంద్రబాబు మీద మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక శివాజీ తెర వెనక్కి వెళ్ళిపోయాడు.

    సడన్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. శివాజీ వస్తాడని ఎవరూ ఊహించలేదు. ఆయన బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేస్తున్నాడన్న వార్తలు పుకార్లే అనుకున్నారు. శివాజీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అవతరించాడు. తన మైండ్ గేమ్ తో టైటిల్ ఫేవరేట్ గా ప్రేక్షకుల్లో ఇమేజ్ రాబట్టాడు. చివరి వారాల్లో అంతా మారిపోయింది. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ తమ గ్రాఫ్ పెంచుకున్నారు. దాంతో మూడో స్థానంతో శివాజీ సరిపెట్టుకున్నాడు.

    శివాజీ శిష్యుడు పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. కాగా సీజన్ 8లో మాజీ కంటెస్టెంట్స్ 2వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో శివాజీ.. కంటెస్ట్ చేస్తున్నాడని కథనాలు వెలువడ్డాయి. 8 మంది మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో శివాజీ అయితే లేడు. తాజాగా మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది. శివాజీ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడుతున్నాడట.

    10వ వారం ఫ్యామిలీ వీక్ ఉంది. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు. నయని పావని కోసం శివాజీ వస్తాడనే ప్రచారం ఊపందుకుంది. నయని పావనికి శివాజీ అత్యంత సన్నిహితుడు. తండ్రి-కూతురు బంధం వాళ్ళది. సీజన్ 7లో కంటెస్ట్ చేసిన శివాజీకి నయని పావని దగ్గరైంది. ఆయనతో బాండింగ్ ఏర్పడింది. నయని పావనికి శివాజీ సపోర్ట్ చేస్తున్నారు కూడాను. శివాజీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే అది సెన్సేషన్ అవుతుంది. షోకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది.

    శివాజీని అందుకు ఒప్పించారట. నయని పావనిని కలిసేందుకు శివాజీ షోకి వస్తాడట. మరి చూడాలి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో. అదే సమయంలో నామినేషన్స్ లో ఉన్న నయని పావని ఈ వారం ఎలిమినేట్ కానుందని అంటున్నారు.