Former minister Nagarjuna : ఏపీలో లైంగిక వేధింపుల కేసులు పరిపాటిగా మారాయి.ముఖ్యంగా రాజకీయ పార్టీల నేతలు,ప్రజా ప్రతినిధులు లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఆదిమూలం లైంగికంగా దాడి చేశారు అంటూ ఆధారాలతో సహా టిడిపి హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ యాక్షన్ కు దిగింది అధినాయకత్వం. ఏకంగా పార్టీ నుంచి కోనేటి ఆదిమూలంను సస్పెండ్ చేసింది. అది మరువక ముందే మరో ఎమ్మెల్యే పై సైతం ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తమను వేధిస్తున్నారంటూ కొందరు మహిళలు బాహటంగానే చెప్పుకొచ్చారు. ఆందోళనలు నిర్వహించారు. అయితే అది టిడిపి అంతర్గత వ్యవహారంతో నడిచిన ఆరోపణలు అని తేలింది. క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాసరావుదానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు వైసీపీ నేతలపై సైతం లైంగిక ఆరోపణల కేసులు బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్సీ అనంత బాబు అసభ్యకర ప్రవర్తన పై సైతం ఫిర్యాదులు వచ్చాయి. మరో వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం సైతం బయటపడింది. అయితే తాజాగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున పై సైతం ఇటువంటి లైంగిక ఆరోపణల కేసు బయటపడింది. తనకు అండగా ఉంటానని నమ్మించిన నాగార్జున లైంగికంగా వాడుకొని వదిలేసారని విజయవాడకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. తన దగ్గర నుంచి 90 లక్షల రూపాయల నగదును పిఏ ద్వారా నాగార్జున తీసుకున్నారని.. ఇప్పుడు ఆ పిఎకి ఫోన్ చేస్తే స్పందించడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ అంశమే సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. తెగ ప్రచారం నడుస్తోంది.
* ఆ దూకుడుతోనే పదవి
మెరుగు నాగార్జున దూకుడు కలిగిన నేత. అందుకే విస్తరణ సమయంలో జగన్ ఆయనకు చాన్స్ ఇచ్చారు. మంత్రి పదవి కేటాయించారు. అయితే నాగార్జున తనకు తను మేధావిగా భావిస్తారు. అటువంటి నేతపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత అంశంగా మారింది. 90 లక్షల రూపాయలు తీసుకోవడంతో పాటు తన పై నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ చెబుతున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు మెరుగు నాగార్జున తాడేపల్లి పరిధిలోని కుంచనపల్లి లో ఓ అపార్ట్మెంట్లో ఇలాంటి పనులు సాగించేవారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే అర్థం వచ్చేలా ఓ మహిళ ఇలా ఫిర్యాదు చేయడం విశేషం.
* గతంలో ఒక గిరిజన టీచర్ హత్య
మరోవైపు డబ్బులు అడుగుతుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధిత మహిళ చెబుతోంది. గతంలో ఓ గిరిజన టీచర్ను ఇలానే చంపేసామని హెచ్చరిస్తున్నారని బాధిత మహిళ చెబుతుండడం విశేషం. మరోవైపు తన చుట్టు కుట్ర జరుగుతోందని మెరుగు నాగార్జున చెబుతున్నారు. అందుకే తనకు తానే పోలీసులను కలిసి కుట్ర పై విచారణ చేయాలని కోరుతానని చెప్పుకు రావడం విశేషం. అయితే తాను మెరుగు నాగార్జునకు డబ్బులు ఇచ్చిన ఆధారాలు.. ఆయన పీఏ ద్వారా తనతో చేయించిన సంభాషణలు.. ఇతర ఆధారాలతో సహా పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడం విశేషం. స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరకడంతో పోలీసులు సైతం చురుగ్గా పావులు కదుపుతున్నట్లు సమాచారం.