Vastu Tips: మనదేశంలో వాస్తుకు ఎంతో విలువ ఇస్తాం. వాస్తు ప్రకారమే అన్ని ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. వాస్తుకు ఆరోగ్యానికి కూడా దగ్గర సంబంధం ఉంటుందని చెబుతుంటారు. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు దరిచేరడానికి వాస్తుయే ప్రధాన కారణంగా అనుమానిస్తుంటారు. మన గృహం సరైన వాస్తు ప్రకారం లేకపోతే మనకు అనేక అనర్థాలు వస్తాయి. వాస్తు పద్ధతులు సరిగా పాటిస్తే ఇలాంటి రోగాల నుంచి ఉపశమనం పొందొచ్చు. మందులు వాడుతూ ఈ చిట్కాలు పాటిస్తే తొందరలోనే వాటికి చెక్ పెట్టొచ్చు.

డయాబెటిస్ ఉన్న వారు నిద్రించేందుకు తూర్పు, ఆగ్నేయ దిశకు మధ్య భాగంలో పడుకోవడం మంచిది కాదు. అలా నిద్రించే వారికి మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ ఆ వ్యాధులు ఉన్న వారు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ఎప్పుడు కూడా ఆ దిశగా నిద్రించడం శ్రేయస్కరం కాదు. పడమర వాయువ్య దిశలో పడక గది ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. ఇలా ఉంటే మాదక ద్రవ్యాల వ్యసనం, ఆత్మహత్య చేసుకోవాలనే ధోరణులు ఏర్పడతాయి. ఈ దిశలు చాలా ప్రమాదకరం
దక్షిణ, ఆగ్నేయ భాగాల మధ్య మరుగుదొడ్డి ఉంటే కండరాల సమస్య ఎదురవుతుంది. ఈశాన్య భాగంలో వంట గది ఉంటే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. ఆగ్నేయంలోనే వంటగది ఉండాలి. దక్షిణ దిశను తెరిచి ఉండటం వల్ల వాస్తు దోశం కలుగుతుంది. ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. అలాంటి ఇంట్లో ఉంటే ఆరోగ్యం సరిగా ఉండదు. అకాల మరణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దక్షిణ దిశను మూసి ఉంచడమే శ్రేయస్కరం. పొరపాటున కూడా దక్షిణ దిశ విషయంలో అజాగ్రత్త వహించకూడదు.

ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరం తల పెట్టి నిద్రించకూడదు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. పడుకునే విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు పడతారు. వాస్తు నియమాల ప్రకారం ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే అనారోగ్య సమస్యలు రావు. ఉపశమనం పొందవచ్చు. వాస్తు పద్ధతుల ప్రకారం మనం ఇంట్లో నియమాలు పాటిస్తే మనకు గొడవలు రాకుండా ఉంటుంది. ఇబ్బందుల నుంచి దూరం కావచ్చు. వాస్తు ప్రకారం సరైన రీతిలో నడుచుకుంటే మన జీవితం కూడా హాయిగా మనగలుగుతుంది.