https://oktelugu.com/

Veedi Pootu: ఈ వీధిపోటు ఉంటే చాలా ప్రమాదకరం అట..వారి వంశానికి వారసులకు సైతం..!

Veedi Pootu: వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్మేవారు ప్రతి ఒక్క విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే మన ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో ముఖ్యంగా వాస్తుతో పాటు వీధిపోటు పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా వీధిపోటు కొందరికి బాగా కలిసి వస్తే మరికొందరికి మాత్రం ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి. వీధిపోటు అంటే రోడ్డుకు ఎదురుగా మన ఇల్లు ఉండి ఆ దారి వెంట వెళ్ళే వారి చూపు మన ఇంటి పై పడటాన్ని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 29, 2021 10:11 am
    Follow us on

    Veedi Pootu: వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్మేవారు ప్రతి ఒక్క విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే మన ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో ముఖ్యంగా వాస్తుతో పాటు వీధిపోటు పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా వీధిపోటు కొందరికి బాగా కలిసి వస్తే మరికొందరికి మాత్రం ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి.

    vastu-tips-telugu

    వీధిపోటు అంటే రోడ్డుకు ఎదురుగా మన ఇల్లు ఉండి ఆ దారి వెంట వెళ్ళే వారి చూపు మన ఇంటి పై పడటాన్ని వీధిపోటు అంటారు.అయితే కొన్నిసార్లు ఇది శుభసంకేతం అయితే మరికొన్ని సార్లు అశుభానికి సంకేతం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం వీధిపోటు ఏ వైపు ఉండాలి ఏ వైపు ఉండకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

    Veedi Pootu

    Veedi Pootu

    వీధిపోటు అంటే ప్రతి దిక్కున మూడు భాగాలుగా చేసి రోడ్డుకు దిగువ వైపు వచ్చే మూడవ భాగానే వీధిపోటు అంటారు. ఈ విధంగా వచ్చే వీధిపోటు ఎంతో మంచిది.
    తూర్పు వైపు – తూర్పుఈశాన్యం, ఉత్తరం- ఉత్తర ఈశాన్యం, పడమర- పడమర వాయువ్యం
    దక్షిణం- దక్షిణ ఆగ్నేయం వంటి వీధిపోట్లు ఎంతో మంచిది. వీధిపోటు తూర్పు వైపు ఉంటే ఆ ఇంటిలో కుటుంబసభ్యులకు మనశ్శాంతి ఉండదు. అదేవిధంగా తూర్పు ఆగ్నేయం ఉంటే ఆ ఇంటి ఇల్లాలి ఆరోగ్యం సరిగా ఉండదు. అదే విధంగా తూర్పు ఈశాన్యంలో వీధిపోటు ఉండటం వల్ల మనశ్శాంతి కరువవుతుంది.

    Also Read: మెంతి ఆకులతో ఆ వ్యాధులకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్.. ఎలా అంటే?

    దక్షిణ భాగంలో వీధిపోటు ఉండటం వల్ల ఇంటి యజమానికి మరణం సంభవించడం కాకుండా ఆ ఇంటి వారసులు కూడా నిలబడరు. అయితే దక్షిణ ఆగ్నేయంలో వీధిపోటు ఉండటం వల్ల కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉంటారు. వీధిపోటు దక్షిణం నైరుతి దిశలో ఉంటే ఆ ఇంటిలోని వారసులు బ్రతకరు.

    పడమర దిశలో వీధిపోటు ఉంటే ఆ ఇంటిలోని అవివాహితులకు వివాహం కాదు. దంపతుల మధ్య కలహాలు ఏర్పడి విడిపోతారు. పడమర నైరుతి దిశలో వీధిపోటు ఉంటే అప్పులపాలు అవుతారు. పడమర వాయువ్యదిశలో వీధిపోటు ఉంటే రాజకీయ నాయకులకు ఎంతో మంచిది.

    ఉత్తర వాయువ్యంలో వీధి పోటు ఉంటే ఇంట్లో ఎప్పుడు కలహాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఉత్తరం వీధి పోటు ఉంటే ఆస్తినష్టం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఉత్తర ఈశాన్యంలో వీధి పోటు ఉండటం ఎంతో మంచిది ఇలా ఉంటే ఇంటి యజమాని ఆయుష్షు పెరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది.

    Also Read: రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..