Children Mobile Addiction: ప్రస్తుత కాలంలో మొబైల్ లేకుండా ఎవరు ఉండలేరు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు మొబైల్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. చిన్నపిల్లలు అయితే ఫోన్ లేకుండా భోజనం కూడా చేసే పరిస్థితి లేదు. అయితే కొందరు దీనిని ఎక్కువగా చూడడం వల్ల వ్యసనంగా మారిపోయింది. ప్రతిరోజు తప్పనిసరిగా ఫోన్ చూడాలని పిల్లలు కోరుకుంటున్నారు. అయితే చిన్న వయసులో ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల వారి కళ్ళకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే మానసిక ఎదుగుదలలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో వారిని మొబైల్ కు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అయితే మొబైల్ అంటే వారు భయపడేలా కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలా ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమం ఆకట్టుకుంది అదేంటంటే?
దసరా పండుగ సందర్భంగా శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగాయి. ఇందులో భాగంగా దుర్గాదేవి విగ్రహాలను వాడవాడలో నెలకొల్పి ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఒక దుర్గాదేవి విగ్రహం వద్ద పిల్లల మొబైల్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చినా కొందరు పిల్లల కోసం దుర్గాదేవి వద్ద ఒక రాక్షసి బొమ్మలు ఏర్పాటు చేశారు. పిల్లలు మొబైల్ చూస్తే వారిని రాక్షసి ఎత్తుకెళ్తుంది అన్నట్లుగా చూపించారు. ఈ సీన్ ను చూసిన పిల్లలు మొబైల్ అంటే భయపడిపోయారు. దీనిపై కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలకు మొబైల్ బాగా అలవాటుగా మారింది. వారి నుంచి ఫోన్ ను దూరం చేయడానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల వారు చదువుపై దృష్టి పెట్టలేకపోతుంటారు. అలాగే ప్రతిరోజు మొబైల్ చూడకుండా ఉండలేమనే భావనకు వస్తారు. అయితే మొబైల్ కు బాగా అలవాటు పడిపోయిన పిల్లలు వారి నుంచి ఫోను దూరంగా ఉంచితే ఆందోళన చెందుతారు. అలా ఒకేసారి వారిని ఇచ్చే దూరంగా చేయకుండా.. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే వారి నుంచి ఫోన్ ను దూరం చేయవచ్చు.
ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొబైల్ వల్ల వచ్చే అనర్థాల గురించి లైవ్ లో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు. మొబైల్ చూడడం వల్ల కళ్ళు ఎలా పాడైపోతాయో ప్రదర్శనలు చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం ఇలా మొబైల్ కు దూరంగా ఉండే విధంగా వివిధ మార్గాల ద్వారా తెలియజేయాలని నిపుణులు తెలుపుతున్నారు. వారి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు ఫోన్ ను చూడకుండా చేయాలి. అప్పుడే వారు మానసికంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు. లేకుంటే మొబైల్ వల్ల ఎన్నో అనర్ధాలు జరిగే అవకాశం ఉంది.