ICAR-CMFRI Jobs: ఐకార్ – సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. యంగ్ ప్రొఫెషనల్, స్కిల్డ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండటం గమనార్హం. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం భర్తీ చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 35,000 రూపాయల వరకు వేతనంగా లభించనుంది. సంబంధిత పనిలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరమని చెప్పవచ్చు. లైఫ్‌సైన్స్ స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం పీజీ ఉత్తీర్ణత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు.
Also Read: జగన్ ఎన్నికలకు వెళతారా? టీడీపీ అనుమానం?
స్కిల్డ్ స్టాఫ్ పోస్టుల ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 16,000 రూపాయలు వేతనంగా లభించనుంది. పది అర్హతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హతను కలిగి ఉంటారని చెప్పవచ్చు.
ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.cmfri.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం మార్చి 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.
Also Read: ఇన్నేళ్లకు నిరుద్యోగులకు వరం ప్రకటిస్తున్న కేసీఆర్.. ఇకనైనా వ్యతిరేకత పోతుందా?