Hyundai: కాలం మారుతున్న కొద్ది వినియోగదారుల అభిరుచులు మారిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా కొత్త వస్తువులు కొనే వారిలో కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. నిత్యావసరాల్లో భాగంగా చాలామందికి కారు కూడా తోడుంటుంది. ఈ వెహికల్ కొనుగోలు చేసే విషయంలో వినియోగదారులు బాగా ఆలోచిస్తారు. నేటికి తగ్గట్టుగా.. డ్రైవింగ్ కు అనుగుణంగా.. ఉండే కార్లను మాత్రమే కొనుగోలు చేస్తారు. వీరికి అనుకూలంగా కంపెనీలు సైతం తమ కార్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మార్కెట్లోకి తీసుకొస్తాయి. లేటేస్ట్ గా Hyundai కంపెనీ తన మూడు కార్లను అప్డేట్ చేసింది. వీటిల్లో Latest Featuresను అమర్చి సరికొత్త రీతిలో మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ మూడు కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
హ్యుందాయ్ కంపెనీ నుంచి ఇప్పటికే మార్కెట్లో గ్రాండ్ ఐ10, వెన్యూ, వెర్నా అనే మోడళ్లు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ మూడు కార్లను ఇప్పుడు కంపెనీ అప్డేట్ చేసింది. వీటిలో Grand i10 హ్యాచ్ బ్యాక్ కారును AMT వెర్షన్లతో సరికొత్త రీతిలో తీసుకురానుంది. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది మాన్యువల్ తో పాటు AMT గేర్ బాక్స్ ఆప్షన్లతో పనిచేస్తుంది. అలాగే ఇందులో ఆటో & ఆపిల్ కార్ ప్లే ఉండనుంది. 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ ప్లే తో పాటు ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ సెటప్ ను అమర్చారు. స్మార్ట్ కి ఫీచర్లు సైతం ఆకట్టుకుంటాయి. ఇ్పటి వరకు ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 రూ. 7.72 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. AMTవెర్షన్ 8.29 లక్షల ధరగా నిర్ణయించారు.
ఇదే కంపెనీకి చెందిన Venue సరికొత్త రీతిలో మార్కెట్లోకి రానుంది. ఈ కారులో 1.2 లీటర్ MPi పెట్రోల్ తో పనిచేస్తుంది. ఇందులో స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే ఉన్నాయి. 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం ను అమర్చారు. దీని AMTధర రూ.10.79 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అయితే వెన్యూ లోని కప్పా మోడల్ ను అప్ గ్రేడ్ చేసింది. ఇది 1.2 లీటర్ల Mpi Petrol S MT, S+Mt వేరియంట్లు 1.2 లీటర్ పెట్రోల్ తో పనిచేస్తాయి. వటిని రూ. 9.8 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇదే మోడల్ లోని S(O) MT సైతం 1.2 లీటర్ ఎం పి ఐ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది.
మరో కారు వెర్నాను అప్డేట్ చేశారు ఇందులో 1.5 లీటర్ల టర్బో జిడిఐ పెట్రోల్ పెట్రోల్ కారు మార్కెట్లోకి రానుంది. ఇది మొత్తం మూడు వేరియంట్లలో మార్కెట్లోకి రానుంది. వీటి ధరలు రూ.12.37 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.15.26 లక్షల వరకు విక్రయించనున్నారు. ఇలా హ్యుందాయ్ తన కార్లను అప్ గ్రేడ్ చేయడంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు.