https://oktelugu.com/

Hyundai: ఆ నాలుగు కార్లపై బంఫర్ ఆఫర్ ప్రకటించిన హ్యుందాయ్.. మార్చి 31 లోపే..

సాధారణంగా ఆటోమోబైల్ రంగంలో పండుగలు, ప్రత్యేక రోజుల్లో మాత్రమే కార్ల ధరల విక్రయాలపై ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. అయితే ఒక్కోసారి కొన్ని కార్ల సేల్స్ తగ్గిపోవడంతో వాటి సేల్స్ పెంచుకోవడానికి ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు.

Written By: , Updated On : March 21, 2025 / 01:37 PM IST
Hyundai Car

Hyundai Car

Follow us on

Hyundai: సాధారణంగా ఆటోమోబైల్ రంగంలో పండుగలు, ప్రత్యేక రోజుల్లో మాత్రమే కార్ల ధరల విక్రయాలపై ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. అయితే ఒక్కోసారి కొన్ని కార్ల సేల్స్ తగ్గిపోవడంతో వాటి సేల్స్ పెంచుకోవడానికి ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. తాజాగా Hyudai కంపెనీకి చెందిన కొన్ని కార్లపై భారీగా తగ్గింపును ప్రకటించారు. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఇవి కొన్ని కార్లపై మాత్రమే ఉంటాయని కంపెనీ తెలిపింది. మరి కొత్తగా కారు కొనాలని అనుకునేవారు.. హ్యుందాయ్ కారు కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని అంటున్నారు. ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసా?

దక్షిణ కొరియా కంపెనీకి చెందిన Hyundai కార్లు దేశంలో అత్యధిక ఆదరణ పొందాయి. వీటిలో క్రెటా, ఆరా, వెర్నా వంటివి ఉన్నాయి. పెట్రోల్,డీజిల్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే ఇటీవల హ్యుందాయ్ కార్ల సేల్స్ భారీగా తగ్గాయి. 2025 ఫిబ్రవరిలో హ్యుందాయ్ హ్యుందాయ్ దేశవ్యాప్తంగా 47, 727 కార్లను విక్రయించింది. ఇదే 2024 ఫిబ్రవరిలో 50,201 యూనిట్ల సేల్స్ ను నమోదు చేసింది. వార్షికంగా చూస్తే ఈ కార్ల సేల్స్ 4.93 శాతం తగ్గాయి. అయితే ఈ కంపెనీకి చెందిన క్రెటా, వెన్యూ కార్లు మాత్రం ఓవరాల్ గా బెస్ట్ సెల్లింగ్ కార్లలా నిలిచాయి.

అయితే మొత్తం కార్ల అమ్మకాల్లో ఎక్సెటర్ 29.29 శాతం క్షీణించింది. ఈ కారు ఈ ఏడాది మొత్తంగా 5,361 యూనిట్లు విక్రయాలు జరుపుకుంది. అలాగే ఐ 20 కారు కూడా 29.31 శాతం తగ్గాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న హ్యుందాయ్ స్థానాన్ని మహీంద్రా కైవసం చేసుకుంది. అయితే తిరిగి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలనిహ్యుందాయ్ చూస్తోంది. ఈ క్రమంలో కొన్ని కార్ల ధరలపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అంటే దాదారూ. రూ.50 వేలకు పైగా తగ్గింపు ధరలతో విక్రయిస్తోంది.

హ్యుందాయ్ కు చెందిన గ్రాండ్ ఐ 10 నియోస్, ఎక్స్ టర్ ఐ 20, వెన్యూ అనే నాలుగు కార్లపై హ్యుందాయ్ భారీ తగ్గింపును ప్రకటించింది. గ్రాండ్ ఐ 10 మోడల్ పై రూ.53,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే ఎక్స్ టర్ రూ.35,000 ప్రయోజనాలతో కొనుగోలు చేయొచ్చు. ఇదే కంపెనీకి చెందిన వెన్యూ మోడల్ పై రూ.55,000 ఆఫర్ ను పొందే అవకాశం ఉంది. మరో మోడల్ ఐ 20 ప్రీమియ్ హ్యాచ్ బ్యాక్ కొనుగోలు చేయాలని అనుకునేవారు రూ. 50,000 వరకు తగ్గింపు ధరను పొందుతారు.

అయితే ఈ ఆఫర్లు మార్చి 31 లోపే ఉంటాయని కంపెనీ తెలిపింది. ఆ తరువాత ఈ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల కొత్తగా కారు కొనాలని అనుకునేవారు.. తక్కువ ధరలో కారు కొనాలని చూసేవారు.. ఈ ఆఫర్ ను పొందవచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొటున్నారు. హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఎక్స్ టర్ ఇప్పటికే ఆదరణ పొందుతోంది.అయినా ఈ కారుపై తగ్గింపు ధరను ప్రకటించడంతో వినియోగదారులు ఆసక్తిని చూపుతున్నారు.