Husband And Wife Relationship: కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. భార్యాభర్తల మధ్య సన్నిహిత్యం తగ్గుతోంది. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతోంది. ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య మాటలే కరువవుతున్నాయి. పూర్వం ఇంట్లో ఏం ఉండేది కాదు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉండేది. మనసు విప్పి మాట్లాడుకునేవారు. రేపు చేయాల్సిన పనులు ఇవాళే ప్లాన్ చేసుకునేవారు. కానీ ప్రస్తుతం అలాంటి అవకాశాలు ఉండటం లేదు. యాంత్రిక జీవనంలా మారిపోయింది. మనుషులు కూడా యంత్రాల్లా మారుతున్నారు. ఫలితంగా మనుషుల మధ్య మాటలే ఉండటం లేదు. దీంతోనే సంబంధాలు కూడా పెరగడం లేదు. ఈ నేపథ్యంలో మనుషుల మధ్య ప్రేమానుబంధాలు ఉండటం లేదు.

ఏదైనా చెబితే నా మాట వినడం లేదనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. భార్య అయినా భర్త అయినా చెప్పిన మాట వినాలంటే దానికో చిన్న టెక్నిక్ ఉంది. జీవిత భాగస్వామిని దగ్గరకు తీసుకుని చెబితే ఎంతటి మాటైని వింటారు. వారి మధ్య ప్రేమ కూడా చిగురిస్తుంది. దూరమవుతున్న బంధాల్లో మన స్పర్శ కూడా వారిలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. దీనికి గాను వారిని మనం దగ్గరకు తీసుకుని హత్తుకుంటే ఎంతటి బాధ అయినా దూరం అవుతుంది. దంపతుల్లో టచ్ కు అంతటి ప్రాధాన్యం ఉంటుంది.
ప్రస్తుత ప్రపంచంలో బాంధవ్యాలు భారం అవుతున్నాయి. మనిషిలో కాస్త సమయం తీసుకుని జీవిత భాగస్వామిని మనసారా మాట్లాడుకుంటే ఎలాంటి మాటనైనా వింటారు. వినరనే ప్రసక్తే ఉండదు. కొందరు తమ మాట తమ భార్య, భర్త వినడం లేదని గోల పెడుతుంటారు. కానీ భార్యను కానీ భర్తను కానీ దగ్గరకు తీసుకుని టచ్ చేస్తూ మనసారా మాట్లాడితే తప్పకుండా వింటుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలుమగల మధ్య బంధాలు బలపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

తల్లి, తండ్రి, కూతురు, కొడుకు ఎవరైనా సరే దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడితే తప్పకుండా వింటారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ దీన్ని ఎవరు పాటించడం లేదు. చీటికి మాటికి చిర్రుబుర్రులాడుతూ విసుక్కుంటూ తల నొప్పులు తెచ్చుకుంటున్నారు. ప్రశాంతంగా ఆలోచించి మన వారిని మాటలతో దరికి తెచ్చుకోవచ్చని తెలుసుకోవాలి. దీనికి గాను మనం చిన్నపాటి శ్రద్ధ తీసుకుంటే చాలు. మన జీవిత భాగస్వామి మన మాట కాదనకుండా మనం ఏది చెబితే అది వినడం చూస్తుంటాం. దీనికి అందరు ప్రేమతో మాట్లాడాలి. అప్పుడే మన మాట చెల్లుబాటవుతుందని తెలుసుకుంటే మంచిది.