Minister Roja: నేడు వైజాగ్ లో అధికార వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానుల కోసం ‘మహా గర్జన సభ’ సభను నిర్వహిస్తోంది. ఈ సభ జరుగుతున్నా రోజునే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కూడా ఉండడం తో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి..పవన్ కళ్యాణ్ వైజాగ్ లో చేపట్టే జనవాణి ప్రోగ్రాంని అడ్డుకుంటామని..పవన్ కళ్యాణ్ ని వైజాగ్ రోడ్డు మీద అడుగు కూడా పెట్టనివ్వబోమని ఇలా వైసీపీ నాయకులూ అనేక సవాళ్లు విసిరారు..కానీ పవన్ కళ్యాణ్ ప్రభంజనం దాటికి వాళ్ళు నిలబడలేకపోయారు.

ఈరోజు వైజాగ్ విమానాశ్రయ ప్రాంగణం పవన్ కళ్యాణ్ అభిమానులతో సంద్రాన్ని తలపించేలా మారింది..అయితే వైసీపీ పార్టీ ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు కూడా గర్జన కార్యక్రమం కోసం విమానాశ్రయంని దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది..ఈ క్రమం లో పవన్ కళ్యాణ్ అభిమానులను దాటుకొని వెళ్ళడానికి వైసీపీ నాయకులకు తల ప్రాణం తోకలోకి వచ్చినట్టు అయ్యింది.
మంత్రులు ఎంత సెక్యూరిటీ తో వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల తాకిడి ని విమానాశ్రయంలో తట్టుకోలేకపోయారు..అలాంటి వాతావరణం ఉన్న చోట మంత్రి రోజా అడుగుపెట్టడంతో ఒక పవన్ కళ్యాణ్ అభిమాని హెల్మెట్ తో దాడి చెయ్యడానికి ముందుకొచ్చాడట..పవన్ కళ్యాణ్ పై రోజా కొద్దీ రోజుల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.

ఆ కోపంతోనే ఆ అభిమాని హెల్మెట్ తో దాడి చేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది..అయితే అతను పవన్ కళ్యాణ్ అభిమానేనా..లేదా టీడీపీ పార్టీ అభిమానా అనేది తెలియాల్సి ఉంది..అక్కడ అసంఖ్యాకంగా ఉన్నది పవన్ కళ్యాణ్ అభిమానులే అవ్వడం తో కచ్చితంగా వాళ్ళే ఈ పని చేసి ఉంటారని తెలుస్తుంది..అంతే కాకుండా మంత్రి జోగి రమేష్ కారుని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అడ్డుకొని దాడి చేసారు..వీరితో పాటుగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కారు పై కూడా రాళ్లతో మరియు కర్రలతో దాడులు చేసారు అభిమానులు..పవన్ కళ్యాణ్ పై ఎల్లప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం వల్లే వారిపై అభిమానులు అలా దాడులు చేసారని రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ.