Naraka Chaturdashi 2022: దీపావళి పండుగను అక్టోబర్ 24న జరుపుకుంటారు. అశ్విని మాసంలో వచ్చే చివరి పండుగ కావడంతో దీపావళిని అందరు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. నరక చతుర్దశి రోజున దీపావళి జరుపుకోవడం ఆనవాయితీ. త్రయోదశి అనగా అశ్విని మాసంలో కృష్ణపక్షం దంతేరస్ నుంచి ప్రారంభం అవుతుంది. దీపావళి పండుగకు ఒక రోజు ముందు నరక చతుర్దశిని జరుపుకుంటారు నరక చతుర్దశి రోజున శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు. నూనెతో స్నానం చేసే సంప్రదాయం ఉంది. నరక చతుర్దశి రోజు పూజా విధానంలో కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉండటం గమనార్హం.

అశ్విని మాసంలో వచ్చే దీపావళి ఈనెల 23న సాయంత్రం 6.03 గంటలకు ప్రారంభమై 24న సాయంత్రం 5.27 గంటలకు ముగుస్తుంది. లక్ష్మీదేవిని అలంకరించి పూజలు చేసి తమ కుటుంబాన్ని సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటారు. కొందరు నోములు కూడా నోచుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ రోజున అభ్యంగ స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని పూజ చేయడం చేస్తుంటారు. ఇంటిల్లిపాది భక్తిశ్రద్ధలతో పూజలు చేసి దేవుళ్లను కొలవడం సంప్రదాయమే.
కాళీ చౌదాస్ ముహూర్తం సందర్భంగా అక్టోబర్ 23న నిర్వహిస్తారు. 24న నరక చతుర్దశి రోజున శరీరానికి నూనె రాసుకుని స్నానం చేయాలి. ఇదే రోజు శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విష్ణువును పూజిస్తారు. సాయంత్రం ముఖద్వారం వద్ద దీపం వెలిగించండి. నాలుగు దిక్కుల్లో కూడా నూనెతో దీపం వెలిగిస్తే మంచిది. దక్షిణదక్కుకు అభిముఖంగా కూర్చుని పూజ చేయాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి.

శ్రీకృష్ణుడు, శివుడు, కాళీమాత, హనుమంతుడు, విష్ణువుల వామన రూపానికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. దీంతో దీపావళి రోజున అత్యంత భక్తి భావంతో జరుపుకుని దేవుళ్లను పూజించాలి. దీపావళిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఉత్తర, దక్షిణ భారత దేశంలో అందరు ఎంతో నిష్టలతో నిర్వహించుకుంటారు. దీంతో ప్రజలు లక్ష్మీదేవిని కొలిచి తమ ఇంటిలో సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకోవడంలో తప్పులేదు. దీనికి అందరు భక్తితో ఉంటారు. లక్ష్మీదేవిని పూజించి తమ దశ మార్చాలని కోరుకోవడం సహజమే.