Dhamaka Teaser: మాస్ మహరాజ గా బిరుదు తెచ్చుకున్న రవితేజ అనుకున్నట్లుగానే ఈమధ్య ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో కనిపిస్తున్నాడు. క్రాక్ నుంచి చూస్తే దాదాపు ఆయన నటించినవి సీరియస్ మూవీసే. లేటేస్ట్ గా రవితేజ నటిస్తున్న సినిమా ‘ధమాకా’. డబుల్ ఇంపాక్ట్ అనేది ట్యాగ్. దీపావళి సందర్భంగా ఈ శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ కు ముందుగానే దివాళీ చేసుకున్నట్లయింది. విజువల్ ఎఫెక్ట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో రవితేజ కనిపించి ఆకట్టుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ ‘ధమాకా’పై విపరీతమైన హోప్స్ పెట్టుకున్నారు.

త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో వస్తున్న ‘ధమాకా’కు ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.దీంతో టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో రవితేజ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ‘నేను మీలో విలన్ ని చూస్తే.. మీరు నాలో హీరోని చూస్తారు..’ కానీ.. నేను యాక్షన్లో ఉన్నప్పుడు శాడిస్టుని..అని ఇంగ్లీష్ లో చెప్పే డైలాగ్స్ మెస్మరైజ్ చేశాయి. అట్నుంచి ఒక బుల్లెట్ వస్తే.. ఇట్నుంచి దీపావళి అనే డైలాగ్ పేలిపోయింది.
‘ధమాకా’ పూర్తిగా యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. ఇందులో లో రవితేజ డ్యూయల్ క్యారెక్టర్ గా కనిపించనున్నారు. అందుకే దీనికి డబుల్ ఇంపాక్ట్ అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఎప్పటిలాగే ఇందులో కూడా రవితేజ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించాడు. మరోవైపు యాక్షన్ ఊరమాస్ లెవల్లో కనిపిస్తోంది. ఇక ‘పెళ్ల సందడి’ హీరోయిన్ శ్రీ లీల తో రొమాన్స్ సీన్స్ ఉన్నట్లుంది. వీరితో పాటు జయరామ్, సత్యం రాజేశ్ కనిపించారు.

టీజర్ లో బ్యాక్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. భీమ్స్ సిసిరోలియో తన ఫర్ఫామెన్స్ ను చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు హోప్స్ తెచ్చే అవకాశం ఉంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ రిచ్ గా కనిపించాయి. కథ స్క్రీన్ ప్లే, మాటలు ప్రసన్నకుమార్ బెజవాడ అందించగా.. ఫైట్స్ రామ్ లక్ష్మణ్ పనిచేశారు. క్రిస్మస్ కానుకగా ‘ధమాకా’ను 23న రిలీజ్ చేయనున్నారు.