Deeparadhana: పూజలు చేయడం ప్రతి రోజు అందరి ఇంట్లో జరుగుతుంది. ఈ పూజల్లో దీపం పెట్టకుండా ఏ పూజ కూడా పూర్తికాదు. దీపం వల్ల దేవతలు ప్రసన్నం అవుతారని.. ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి అని అంటారు పండితులు. మరి దీపం పూర్తిగా కాలిపోతుంది కొన్ని సార్లు. ఇలా జరగడం దేనికి సంకేతమో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
మీరు పెట్టిన దీపం పూర్తిగా కాలిపోతే మీ కోరిక నెరవేరుతుందని అర్థమట. శత్రువు నుంచి కూడా విముక్తి కలగబోతుందని అర్థం అంటున్నాయి శాస్త్రాలు. దేవుడి ఆశీస్సులు కూడా మీ వెంటే ఉంటాయట. దీపం మధ్యలో ఆరిపోతే, మీరు ఏకాగ్రతగా ఉండాలని.. కష్టపడి పనిచేయాలని అర్థమట. అప్పుడే భవిష్యత్తులో విజయం సాధిస్తారు.
ప్రయోజనాలు ఏంటి?
దేవాలయంలో దీపం వెలిగించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కానీ దీపం వెలిగించే నియమాలను కూడా పాటించాలి. ఇది పాటించడం చాలా ముఖ్యం అంటున్నారు పండితులు. నెయ్యి లేదా ఆవనూనె తో దీపాన్ని వెలిగించడం వల్ల శుభ ఫలితాల వస్తాయట. దీపంలో పువ్వు ఏర్పడితే, మీ ఆరాధన భగవంతుడిని చేరిందని, మీ ఆరాధనతో దేవుడు సంతృప్తి చెందాడని అర్థమట. దీపపు జ్వాలలో వేణువు ఆకారం ఏర్పడితే శ్రీకృష్ణుని ప్రేమ, ఆశీస్సులు ఉన్నాయని నమ్ముతారు. త్వరలోనే శుభవార్తలు అందబోతున్నాయని అర్థం.