Kannappa: కన్నప్ప ట్రైలర్ వచ్చేది అప్పుడేనట…ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా..?

Kannappa: మంచు విష్ణు మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకు ఏ సినిమా కూడా కలిసి రావడం లేదు. ఇక నిన్న మొన్న వచ్చిన హీరోలు సైతం స్టార్ హీరోలుగా గుర్తింపు పొందుతుంటే...

Written By: Gopi, Updated On : July 6, 2024 2:06 pm

Kannappa Movie Trailer Release Date

Follow us on

Kannappa: మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోలుగా వచ్చిన తన ఇద్దరు కొడుకులు సక్సెస్ లు సాధించడంలో మాత్రం వెనుకబడి పోతున్నారు. అందుకే వాళ్లు ఎన్ని సినిమాలు చేసిన కూడా సరైన గుర్తింపు అయితే రావడం లేదు. ఇక మనోజ్ కొన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మరోసారి తను హీరోగా కొన్ని సినిమాలను అనౌన్స్ చేసి సెట్స్ మీదికి తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే మంచు విష్ణు మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకు ఏ సినిమా కూడా కలిసి రావడం లేదు. ఇక నిన్న మొన్న వచ్చిన హీరోలు సైతం స్టార్ హీరోలుగా గుర్తింపు పొందుతుంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వీళ్ళు మాత్రం ఒక్క సక్సెస్ కొట్టడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక దానికి తోడుగా వీళ్ళు బయట ఏది పడితే అది మాట్లాడటం వల్ల ట్రోలింగ్స్ కి గురవుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఎలాగైనా సరే పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలనే ఉద్దేశ్యంతో 150 కోట్ల బడ్జెట్ తో విష్ణు ‘కన్నప్ప ‘ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అది కొంతవరకు నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ విష్ణు చేస్తున్న ప్రయత్నానికి మాత్రం అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక దానికి తోడుగా ఈ సినిమా నుంచి తొందర్లోనే ట్రైలర్ కూడా రాబోతుంది.

మరి టీజర్ చూపించిన దాని కంటే ట్రైలర్ మరింత ఇంపాక్ట్ ను చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వచ్చి తన చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల చివర్లోనే ఈ సినిమాకు సంబంధించిన మొదటి ట్రైలర్ ని రిలీజ్ చేయాలని విష్ణు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది…