Jewelry : భారతదేశంలో బంగారం అంటే ఇష్టం ఉండని వారు దాదాపు తక్కువ మందే ఉంటారు. అందుకే ఇక్కడ బంగారం ధర 10 గ్రాములకు లక్ష రూపాయలు దాటింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే బంగారం ధరలు ఎంత పెరుగుతున్న దీనికి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే భారత్లో బంగారాన్ని మహిళలు చాలా ఇష్టంతో కొనుగోలు చేస్తారు. ఎంతోకొంత బంగారమైన కొనుగోలు చేయడానికి ఆస్కారం చూపిస్తారు. అయితే ప్రస్తుతం ధరలు పెరుగుతున్న సమయంలో బంగారం కొనడానికి కొంతమంది వెనుకడుగు వేస్తున్నారు. కానీ బంగారం వేసుకోవాలన్న కోరిక మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో తక్కువ బంగారం తోనే ఆకర్షణీయమైన ఆభరణాలను చేసుకోవచ్చని కొందరు చెబుతున్నారు. అలాంటి ఆభరణాలు ఏవంటే?
మంగళసూత్రం:
పెళ్లయిన ప్రతి ఒక్కరి మెడలో మంగళసూత్రం తప్పనిసరిగా ఉంటుంది. అయితే మిగతా ఆభరణాలు ఎలా ఉన్నా మంగళసూత్రం మాత్రం కచ్చితంగా బంగారం తోనే కలిగి ఉంటుంది. ఈ మంగళసూత్రం ను లక్ష్మీదేవిగా భావించి మొత్తం బంగారంతో ఉండేలా చూస్తారు. మొత్తం మంగళసూత్రం బంగారంతో కలిగి ఉంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ నల్లపూసలతో కలిగిన మంగళసూత్రంను ధరించవచ్చు. ఇందులో ప్రధాన మంగళసూత్రం బంగారంతో కలిగి ఉన్న.. మిగతా హారం మొత్తం నల్లపూసలతో కలిగి ఉండడంతో ఆకర్షనీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది తక్కువ ధరలో లభిస్తుంది. ఇలా చేసిన దానిని ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు.
Also Read : విండో, స్ప్లిట్ ఏసీలకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? ఎంతకాలం వాడొచ్చు?
జుంకాలు:
మహిళలకు ఆకర్షణమిచ్చే ఆభరణాల్లో జుంకాలు కూడా ఉంటాయి. ఇవి రకరకాల డిజైన్లలో అందుబాటులో ఉంటాయి. అయితే చాలామంది జుంకాలను మొత్తం గోల్డ్ తో తయారు చేయించుకుంటారు. కానీ ఇలా చేస్తే ఎక్కువ బంగారం అవసరం ఉంటుంది. అయితే జుంకాలను నల్లపూసలతో తయారు చేయడం వల్ల తక్కువ బంగారం అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. తక్కువ ధరలో వీటిని తయారు చేయించుకోవచ్చు. లేదా అందుబాటులో ఉంటే కొనుగోలు చేసుకోవచ్చు.
ముత్యాల స్టడ్స్:
బంగారం కొనలేని వారికి ముత్యాలతో కూడిన ఆభరణాలు చేయించుకోవచ్చు. ఇవి మొత్తం బంగారం కంటే ఎక్కువగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చుట్టూ బంగారం ఉండి మధ్యలో ముత్యాలు ఏర్పాటు చేయడం వల్ల ఎదుటివారి మనసును దోచేస్తాయి. అంతేకాకుండా ముత్యాలు తెల్లగా ఉండి చుట్టూ బంగారం ఉండడం వల్ల డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ శరీరానికి అందాన్ని తీసుకొస్తాయి. అందువల్ల తక్కువ బంగారంతో వీటిని తయారు చేసుకోవచ్చు.
చెవి రింగులు:
మహిళలకు మెడలో ఆభరణాల తర్వాత అందాన్ని ఇచ్చేవి చెవి రింగులు. వీటి కోసం ప్రత్యేక డిజైన్ ను ఎంచుకుంటారు. అయితే చెవిరింగులు దాదాపుగా మొత్తం బంగారం తోనే కలిగి ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఎక్కువ బంగారం అవసరం ఉంటుంది. అయితే తక్కువ బంగారంతో ముత్యాలు కలిగిన చెవి రింగులను కూడా తయారు చేయించుకోవచ్చు. ఇవి చూడ్డానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాకుండా తక్కువ బంగారం అవసరం పడి ధర తక్కువగా ఉంటుంది.