AC : మందులు, తినుబండారాల మీద ఎక్స్ పైరీ డేట్ చూసే ఉంటాం. కానీ మిగతా వస్తువుల్లాగే ఏసీలకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు. కానీ ఇంకా చాలామందికి దీని గురించి సరైన సమాచారం లేదు. కొత్త ఏసీ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా ఏసీ లైఫ్ టైం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసుకోవాలి. చాలా ఏసీ తయారీ కంపెనీలు 10 సంవత్సరాల కంప్రెసర్ వారంటీని అందజేస్తున్నాయి. అంటే వారి ప్రొడక్ట్ 10 సంవత్సరాలు ఈజీగా పనిచేస్తుందని కంపెనీ కూడా భావిస్తోంది. అయితే, ఏసీకి ఎక్కువ లైఫ్ రావాలంటే క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ చేయాలి. సమయానికి సర్వీసింగ్ చేయించాలి.
Also Read : మీ ఏసీ డిస్‌ప్లేలో ఇవి కనిపిస్తున్నాయా.. పెద్ద సమస్య వచ్చినట్లే!
ఏసీ లైఫ్‌స్పేన్
సాధారణంగా ఏసీ మెయింటెనెన్స్, ఏసీ కండిషన్ ఆధారంగా విండో, స్ప్లిట్ ఏసీలను 8 నుండి 10 సంవత్సరాల వరకు ఉపయోగించవచ్చు. ఏసీ యూనిట్‌ను సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోతే, కంప్రెసర్ పాడయ్యే, ఏసీలో మంటలు వచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది.
విండో లేదా స్ప్లిట్ ఏసీ అయినా, గంటల తరబడి నిరంతరం ఉపయోగిస్తే కంప్రెసర్‌పై లోడ్ పెరగవచ్చు. కంప్రెసర్‌పై లోడ్ పెరగడం వల్ల ఏసీలో ఓవర్‌హీటింగ్ సమస్య వచ్చి మంటలు చెలరేగడం, ఏసీ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఏసీ పాడవడానికి ఏసీ గ్యాస్ లీక్ కావడం వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.
ఏసీ లైఫ్‌ను ఎలా పెంచాలి?
ఎయిర్ కండీషనర్ లైఫ్‌ను పెంచడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు, రెగ్యులర్ మెయింటెనెన్స్ (ఏసీ సర్వీసింగ్), ఫిల్టర్ శుభ్రం చేయడం, ఏసీని సరిగ్గా ఉపయోగించడం వంటివి.
Also Read : ఈ ఏసీ ఉంటే కరెంట్ బిల్లు టెన్షన్ ఉండదు.. రాత్రింబవళ్లు వాడినా నో ప్రాబ్లమ్!