Prescription Reading Service: Artificial Intelligence (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమో? ఏది అబద్దమో? లేకుండా పోయింది. అయితే ఇలాంటి సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొందరు ఫేక్ సలహాలు ఇస్తూ ప్రాణాలు తీస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వచ్చే ఆరోగ్య సలహాలను వెంటనే పాటించకుండా వాటి విషయంలో వైద్యులను సంప్రదించి ఆ తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలి. అయితే ప్రతిసారి అందుబాటులో వైద్యులు ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో కొందరు వైద్యులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నారు. వీరి ద్వారా వైద్య సేవలు మాత్రమే కాకుండా.. వైద్యానికి సంబంధించిన ఏ సందేహం ఉన్న వెంటనే తీరుస్తారు. అది ఎలా అంటే?
Also Read: ప్రతీ నగరంలో కనిపించే ‘ర్యాపిడో’ను తెచ్చింది తెలుగు కుర్రాడే.. ఎవరో తెలుసా?
వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఉన్నా దీనిద్వారా మెసేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఉద్యోగులు, వ్యాపారులు వాట్సాప్ ద్వారా అనేక రకాల ప్రయోజనాల పొందుతున్నారు. అలాగే ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. వాట్సాప్ ఉన్నవారు 8738030604 అనే నెంబర్ ను సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత August AI అనే పేరుతో ఆటోమేటిగ్గా సేవ్ అవుతుంది. దీనిని ఓపెన్ చేసి వైద్యానికి సంబంధించిన ఎటువంటి సలహా అయినా పొందవచ్చు.
ఉదాహరణకు ఎవరైనా డాక్టర్ రాసిన కొన్ని మెడిసిన్ తిరిగి తీసుకోవాలంటే అవి మనకు అర్థం కావు. అంతేకాకుండా దీనిని ఇతరులకు షేర్ చేద్దామంటే ఒక్కోసారి స్క్రిప్ట్ అర్థం కాకుండా ఉంటుంది. అయితే ఈ ప్రిస్క్రిప్షన్ అర్థం కావాలంటే దీనిని ఒక ఫోటో తీసి August AI కి మెసేజ్ చేయడం ద్వారా అందులో ఎటువంటి మెడిసిన్ ఉన్నాయో క్లియర్గా అర్థమయ్యేలా రిప్లై వస్తుంది. అలాగే అత్యవసర సమయంలో ప్రాథమిక చికిత్స పొందడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
కొందరికి వాట్సప్ అందుబాటులో ఉన్న మెసేజ్ టైప్ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి సమయంలో వాయిస్ మెసేజ్ పెట్టినా కూడా రిప్లై వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక ఆహారానికి సంబంధించిన ఫోటో దీనికి పంపించినా.. అందులో ఎన్ని క్యాలరీలు ఉన్నాయి? దీన్ని తీసుకుంటే ఎటువంటి లాభం జరుగుతుంది? ఎటువంటి నష్టం జరుగుతుంది? ఎవరెవరు ఈ ఆహారం తీసుకోవాలి? అనే విషయాలను పూర్తిగా అందిస్తుంది.
Also Read: గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా?
అయితే ఇది కేవలం ప్రాథమిక అవసరాలకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు దీనిని నమ్మకుండా రైతులను సంప్రదించాల్సి ఉంటుంది. కేవలం వైద్యానికి సంబంధించిన సందేహాలు తెలుసుకోవడానికి.. డాక్టర్స్ రాసిన ప్రిస్క్రిప్షన్ అర్థం కావడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సలహాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో దేశంలోని ప్రముఖ వైద్యుల బృందం అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఎటువంటి సలహా అయినా దీని ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది.