Aadhar Card: మన దేశ పౌరులకు ముఖ్యమైన కార్డులలో ఆధార్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ మనకు గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాలు పొందడంతో పాటు ఆర్థిక లావాదేవీలు చేయడానికి ఆధార్ కార్డ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డ్ వ్యక్తి అడ్రస్ తో పాటు బయోమెట్రిక్ సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే ఆధార్ కార్డుపై సమాచారం ఇంగ్లీష్ లో ఉంటుంది.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ప్రాంతీయ భాషలలో ఆధార్ కార్డును పొందే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. ఒరియా, కన్నడ భాషలతో పాటు మలయాళం, మరాఠీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ భాషలలో ఆధార్ కార్డును పొందే అవకాశం ఉంటుంది. ఆధార్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించి స్థానిక భాషను మార్చుకోవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా కూడా భాష వివరాలను మార్చుకోవచ్చు.
ఆన్ లైన్ ద్వారా స్థానిక భాషను మార్చుకోవాలని భావించే వాళ్లు మొదట https://uidai.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత ఆధార్ హోమ్ పేజ్ లోకి వెళ్లి అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్‌లైన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్, సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా బటన్ పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత స్థానిక భాషలో పేరు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వివరాలను ప్రివ్యూలో చెక్ చేసుకొని ఓటీపీని ఎంటర్ చేసి 50 రూపాయలు డిపాజిట్ చెల్లించాలి. ఈ విధంగా ఆధార్ లోని స్థానిక భాషను సులభంగా మార్చుకోవచ్చు.