https://oktelugu.com/

పవన్ పై మళ్లీ విరుచుకుపడ్డ పోసాని కృష్ణమురళి.. జనసైనికుల ముట్టడి.. ఉద్రిక్తం

నిన్న పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మరోసారి ఈరోజు సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ ను తిట్టినందుకు తన బెదిరింపులు వస్తున్నాయని.. పవన్ ఫ్యాన్స్ నుంచి మెసేజ్ లు వస్తున్నాయని పోసాని మీడియా ముందట ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే రెండోరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. పోసాని మాట్లాడుతూ ‘నన్ను బూతులు తిడుతూ […]

Written By: , Updated On : September 28, 2021 / 07:22 PM IST
Follow us on

నిన్న పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మరోసారి ఈరోజు సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ ను తిట్టినందుకు తన బెదిరింపులు వస్తున్నాయని.. పవన్ ఫ్యాన్స్ నుంచి మెసేజ్ లు వస్తున్నాయని పోసాని మీడియా ముందట ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే రెండోరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ పై మరోసారి విరుచుకుపడ్డారు.

పోసాని మాట్లాడుతూ ‘నన్ను బూతులు తిడుతూ వందలాది మెసేజ్ లు వస్తున్నాయని.. జగన్ ను పవన్ అనరాని మాటలు అన్నారని పోసాని చెప్పుకొచ్చాడు. ఇక ఆరోపణలు చాలా మందిపై చేస్తారని.. పవన్ వ్యక్తిగతంగా మాట్లాడారని విమర్శించాడు.

గతంలో కేసీఆర్ కూడా విమర్శించాడని.. అప్పుడు పవన్ కు కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడని పోసాని తెలిపారు. పవన్ పై పగ పెట్టుకునే ఆలోచన లేదని.. నేను జగన్ అభిమానిని అని పోసాని స్పష్టం చేశారు. అందుకే రియాక్ట్ అయ్యానని తెలిపారు. నిన్నటి నుంచి ప్రతీ సెకండ్ కు ఫోన్లు వస్తున్నాయని బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయాలకు ఇంట్లో వాళ్లకు సంబంధం ఏంటని.. చిరంజీవిపై కేశినేని కామెంట్స్ చేసినప్పుడు పవన్ ఎక్కడ ఉన్నాడని.. నాడు ఒక్క మాట మాట్లాడలేదని పోసాని చెప్పుకొచ్చాడు.

పవన్ ఒక సైకో.. ఎవరో ఫంక్షన్లు పెట్టుకుంటే అక్కడికి పవన్ ఫ్యాన్స్ ఎందుకు వస్తున్నారని పోసాని మరోసారి ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అనే సైకో వెదవకి చెబుతున్నా.. నీకూ ఆడపిల్ల ఉంది.. ఆ పిల్ల పెద్దదవుతుంది.. గుర్తు పెట్టుకో నేను బతికే ఉంటా అని సంచలన ఆరోపణలు చేశారు. నా భార్యను అన్ని మాటలు అన్నందుకు నిన్ను ఏమైనా అనొచ్చు అంటూ పోసాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

పోసాని మాట్లాడిన వీడియో

LIVE : పవన్ పై పోసాని సెటైర్లు | Posani Krishna Murali  Press Meet LIVE | NTV LIVE