Drive On The Left: మన దేశంలో కుడివైపు స్టీరింగ్ ఉంటుంది. ఎడమ వైపుకు వెళ్లాలి. అదే అమెరికాలో స్టీరింగ్ కుడివైపుకే ఉంటుంది. కుడివైపుకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో మనం హాలీవుడ్ సినిమాలు చూస్తే అక్కడ వాహనాలకు స్టీరింగ్ కుడివైపున ఉండటం గమనిస్తాం. ఇలా ఎందుకుంటుంది అనే అనుమానాలు అందరిలో వస్తాయి. దీనికి సహేకరమైన సమాధానాలు కూడా ఉన్నాయి. అసలు ఈ తేడా ఎందుకని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

వాహనాలు లేని సమయంలో గుర్రాలే వాహనాలుగా ఉపయోగపడేవి. రానురాను వాహనాల రాకతో పరిస్థితులు మారిపోయాయి. 1700వ సంవత్సరంలో కూడా గుర్రాలనే వాడుతూ ఉండేవారు. గుర్రాలను ఎక్కేటప్పుడు కుడిచేతి వాటం ఉపయోగించేవారు అప్పట్లో కత్తులు కూడా వాడేవారు. దీంతో ఎడమవైపు ఒరలో ఉన్న కత్తులతో గుర్రం ఎక్కడం వీలు కాకపోవడంతో కుడివైపు నుంచి గుర్రం ఎక్కుతుండే వారు. అందుకే ఎడమ వైపు నుంచి ప్రయాణం చేయడం ప్రారంభించారు. అందుకే మనదేశంలో ఎడమ వైపు నుంచే ప్రయాణం సురక్షితమని భావించారు.
Also Read: Beast First Day Collections: ఎంతకు కొన్నారు ? ఎంత నష్టపోతున్నారు ?
1756లో లండన్ బ్రిడ్జిపై రహదారి ఏర్పాటు చేయడంతో ఎడమ వైపు నుంచే వెళ్లాలని సూచించడంతో అందరికి ఎడమవైపు ప్రుయాణం అలవాటుగా మారింది. కానీ అమెరికాలో మాత్రం కుడివైపు ప్రయాణించడం తెలిసిందే. 1915లో హెన్లీ పోర్ట్ కార్లలో ఉండే డ్రైవర్ సీటును ఎడమ వైపు ఉంచాడు. దీంతో అప్పటి నుంచి అందరు కుడివైపుకు ప్రయాణించడం అలవాటు చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో అదే విధంగా ఇప్పటికి కూడా అదే దారిలో నడుస్తున్నారు.

మన దేశంలో అయితే స్టీరింగ్ కుడి వైపు ఉండి ప్రయాణం మాత్రం ఎడమ వైపుకు చేస్తాం. అదే అమెరికాలో వారు మాత్రం స్టీరింగ్ ఎడమ వైపు ఉంచుకుని కుడివైపుకు ప్రయాణించడం తెలిసిందే. దీంతో ఇదేదో పెద్ద వింతగా తోస్తుంది. కానీ అక్కడి వారికి అది అలవాటైతే మనకు ఇది అలవాటైంది. షరామామూలే కదా అని సర్దుకుపోవాల్సిందే.
Also Read:NTR Sons Favourite Hero: NTR కొడుక్కి ఇష్టమైన హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు