RRR OTT Release Date: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ ప్రపంచ సినీ లోకమంతా షాక్ అయిపోయింది. ఎంత విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయితే మాత్రం.. అసలు రోజురోజుకు వందల కోట్లును ఎలా కలెక్ట్ చేసింది ? అంటూ ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యచకితులు అయ్యారు.
RRR OTT Release Date
అయితే.. ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల నుంచి మాకు అందిన సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ సినిమా రైట్స్ జీ5 మరియు నెట్ ఫ్లిక్స్ వారు కొన్నారు. జీ5, నెట్ ప్లిక్స్ వారు ఈ చిత్రాన్ని హిందీలో తప్ప మిగతా అన్నీ బాషలలోను విడుదల చేయబోతున్నారు .
Also Read: Beast First Day Collections: ఎంతకు కొన్నారు ? ఎంత నష్టపోతున్నారు ?
ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే.. ? సినిమా రిలీజ్ అయిన 2 నెలలకి అంటే మే 25వ తేదీన ఆర్ఆర్ఆర్ చిత్రం బుల్లి తెరపైకి రానుంది. అలాగే ఏప్రిల్ 20 న కూడా వచ్చే అవకాశాలున్నాయని సమాచారం అందుతుంది. ఏది ఏమైనా నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన ఈ క్రేజీ భారీ మల్టీస్టారర్ భారీ విజయాన్ని అందుకుంది.
‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్స్ చూసి సినిమా విశ్లేషకులు సైతం షాక్ అయ్యారు. ;ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.
RRR OTT Release Date
ఈ సినిమా 10 రోజుల్లోనే టోటల్ వరల్డ్ వైడ్ గా 501.74 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే.. పదో రోజు నుంచి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్నీ లాభాలు కింద లెక్కే. ఒక తెలుగు సినిమా ఫస్ట్ టెన్ డేస్ కలెక్షన్స్ లో కూడా ఈ రేంజ్ ఫిగర్ ను నెలకొల్పడం సరి కొత్త రికార్డ్. తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం.
Also Read:Bheemla Nayak Closing Collections: భీమ్లా నాయక్ క్లోసింగ్ కలెక్షన్స్